ఉంటే ఉగాది.. లేకపోతే తగాది..
ఆనందానికి ఆది.. ఉగాది. ఇది అందరి జీవితాల్లోనూ ఆనందోత్సాహాలను నింపే పర్వం. ఎందుకంటే, మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది ఉగాది నుంచే. ఈ ఉగాదిని ఆధారంగా చేసుకుని పలు సామెతలు వాడుకలో ఉన్నాయి. అవి పండుగ విశిష్టతను తెలపడంతో పాటు పండుగ ఆధారంగా ఉన్న విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. అటువంటి కొన్ని ఉగాది సామెతల పరిచయం. ఉంటే ఉగాది.. లేకుంటే శివరాత్రి ఎవరి జీవితంలోనైనా ఏదో సందర్భంలో కలిమిలేములు తప్పవు. అటువంటి సందర్భాలను




