పలుకు‘బడి’

దశ తిరిగింది

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం
దశ తిరగడం
కాలం కలిసి రావడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది జ్యోతిష శాస్త్ర సంబంధంగా ఆవిర్భవించిన జాతీయం. జ్యోతిషం ప్రకారం కొంతమందికి కొన్ని గ్రహాల దశలు అనుకూలంగా ఉంటాయనేది నమ్మకం. ఆ అనుకూల కాలంలో ఏ కార్యం తలపెట్టినా చాలా సులువుగా విజయం లభిస్తుందని అంటారు. ఈ భావన ఆధారంగా అప్పటి దాకా ఎన్నెన్నో కష్టాలను అనుభవించి ఏ కారణం చేతనైనా ఒక్కసారి సంపదలు రావటమో, సుఖాలు ప్రాప్తించటమో జరిగితే.. ‘ఆహా వీడి కష్టాలు ఇన్నాళ్లకు తీరాయి.. ఇక వీడి దశ తిరిగింది అని అనేటటువంటి సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది.
గ్రహచారం
మనకు గ్రహాల గమనం, తిథి, వార, నక్షత్రాలు ఎలా కలిసి వస్తాయో రావో అంచనా వేసుకోవడానికి ఉగాది పర్వదినం ఒక వేదిక. ఈనాడే చాలామంది తమ గ్రహస్థితుల గురించి పండితుల చేత చెప్పించుకుంటారు. ఇదిలా ఉంచితే, తెలుగు జాతీయాల్లో ఈ గ్రహచారం అనే పదం సామాన్యంగా అదృష్టం అని చెప్పడానికి పర్యాయపదంగా వాడుతున్నారు. చర అంటే కదలిక. గ్రహచారం అంటే గ్రహాల కదలిక అని అర్థం. గ్రహాలు కదులుతూ ఉంటాయి. మనిషి పుట్టినపుడు తిథి, వార, నక్షత్రాలను బట్టి జాతక చక్రం వేసి అతని జీవిత గమనాన్ని అంచనా వేస్తుంది జ్యోతిష శాస్త్రం. గ్రహాలు ఆయా రాశులలో చేసే ప్రయాణాలను బట్టి వివిధ రాశులలో రకరకాల ఫలితాలను చెబుతారు జ్యోతిషులు. ఈ విధంగా గ్రహాలను బట్టి అదృష్టం, దురదృష్టం నిర్ణయించే సంస్క•తి ఆధారంగా పుట్టిన మాట- గ్రహచారం. ‘అతని గ్రహచారం బాగాలేదు. అందుకే ఇలా జరిగింది’ వంటి మాటల్లో ఈ జాతీయం వినిపిస్తుంది.
ఆకు రాలిన చోట..
‘పడేసిన చోటే ఏరుకోవాలి’ అనేది తెలుగు సామెతల్లోనూ, జాతీయాల్లోనూ కనిపించే ప్రయోగం. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే మళ్లీ పొందడానికి ప్రయత్నించాలనే ఆశావహ దృక్పథం ఈ జాతీయంలో కనిపిస్తుంది. అటువంటి జాతీయమే, ఇటీవల వాడుకలో వచ్చినది- ‘ఆకు రాలిన చోట’. ఒక్కో రుతువులో ఒక్కో పరిణామం చోటుచేసుకుంటుంది. శీతల శిశిరంలో ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడు వారతాయి. రాలిన ఆకులు ఎండిపోయి, గాలివాటుకు అటుఇటు కొట్టుకుపోతాయి. తిరిగి వసంతం రాగానే అదే చోట మళ్లీ కొత్త చిగుళ్లు వేస్తాయి. చెట్లన్నీ పచ్చని శోభను సంతరించుకుంటాయి. అది చూసి పరవశించి కోయిలలు కుహూ.. కుహూ అని గానం చేస్తాయి. ఇది మానవ జీవితాల్లో వసంత కాలం నింపే ఆశావహ దృక్పథం. ఒక శోభ అదృశ్యమైన చోట మరో ఆశ అవతరిస్తుంది. ఆకు రాలిన చోట చిగురు పలకరిస్తుంది. ఈ ఆశలు చిగురించే సందర్భమే ఉగాది. అదే వసంత కాలం.
పచ్చడిలో పరమార్థం
ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనం. దాని రుచి కొంత భిన్నంగా ఉంటుంది. చాలామందికి ఇది రుచించదు. అయితే, హాయిగా ఆస్వాదించగలిగితే ఉగాది పచ్చడిలో ఉన్న ఆనందమే ఆనందం. ఇంకే వంటకంలోనూ, ఆహార పదార్థంలోనూ లేని రుచి దీనిది. పుల్లపుల్లగా, చేదుచేదుగా, తీయతీయగా కలగలిపి ఉంటుందీ పచ్చడి. ‘అయ్యో.. చేదు’ అని ఊసేయబోతే మిగతా రుచులూ నేలపాలవుతాయి. అన్ని రుచులూ కలగలిపిన పచ్చడిని ఆస్వాదించినట్టే, అన్ని అనుభవాలు కలగలసిన జీవితాన్ని అనుభవించాలని చెప్పేది ఉగాది పచ్చడి. ఇదే ఉగాది పచ్చడి చాటే జీవిత పరమార్థం.
మన సంప్రదాయాల్లో వచ్చే పండుగలు, పర్వా లన్నీ ఆయా దేవతులు, దేవుళ్లకు సంబంధించినవే. అంటే ప్రతి పండుగ ఏదో ఒక దేవుడో, దేవతో ప్రాధా న్యంగా ఉన్నవే. ఆ పండుగ నాడు ఆ దేవత లేదా దేవు డిని ప్రధానంగా పూజించడం ఆచారంగా వస్తోంది. అయితే, మన పండుగల్లో కేవలం రెండు పండుగలు మాత్రం ఏ దేవుడూ దేవతకూ సంబంధించినవి కావు. అవి, ఒకటి- సంక్రాంతి, రెండు- ఉగాది.
ఉగాది నాడు ప్రత్యేకించి ఏ దేవతనూ, దేవుళ్లనూ పూజించడం ఉండదు. ఎవరి ఇష్ట దేవతను వారు ఈనాడు స్మరించుకుంటారు.
ఉగాది ఏ దైవానికి సంబంధించినదీ కాక పోతే, మరి ఎవరికి సంబంధించినందంటే..?
ఉగాది కాల స్వరూప పర్వం. అంటే కాలాన్ని దైవంగా భావించి జరుపుకునే పండుగ.
బ్రహ్మ ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ రోజును/సమయాన్ని ఉగాదిగా వ్యవహరించడం సంప్ర దాయంగా వస్తోంది.
ఉగాది పండుగ మనకు చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే మన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది. తెలుగు సంవత్సరాన్ని లెక్కించేందుకు వీలుగానే మన పెద్దలు ఉగాది పండుగను ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవులకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాల స్వరూపమైన సంవత్సరంలోనే నివసిస్తున్నాయి. వీటన్నిటినీ స్మరించుకునే సందర్భమే ఉగాది.
ఉగాది నాడు తీసుకునే వేప పువ్వు పచ్చడి, కాలాన్ని స్మరిస్తూ కొన్ని శ్లోకాలు పఠించాలి. వాటి వివరాలు తెలుసు కుందాం.
ఉగాది పచ్చడిని ఇష్ట దైవాలకు నైవేద్యంగా సమ ర్పించిన అనంతరం, దానిని మహా ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ.
ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఆరంభ మవుతుందనడానికి ఆధారంగా ‘సూర్య సిద్ధాంతం’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలో ఉన్న శ్లోకమిది..
చైత్రమాసి జగద్బ్రహ్మ
సపర్ణ పథమే అహని
వత్సరాదౌ వసంతాదౌ
రసరాద్యే తదై వచ
ఉగాది పచ్చడిని తయారు చేసే సందర్భంలో పఠించాల్సిన శోక్లం ఇది. ఇది ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి తెలుపుతుంది. ఈ శ్లోకం ధర్మసింధు గ్రంథంలోనిది..
యద్వర్షాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేస్యా
త్తద్వర్షం సౌఖ్యదాయకమ్
ఇక, ఉగాది పచ్చడిని తినే ముందు పఠిం చాల్సిన శ్లోకం కూడా ఒకటి ఉంది.
త్వామష్ట శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఇక, ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల కలిగే ఫలితం గురించే తెలిపే శ్లోకం ఇది..
శతాయు వజ్రదేహాయ
సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ
నింబకం దళభక్షణం

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top