5.3.1991, నిజామాబాద్ మిత్రులు విజయకుమార్ గార్కి ఉగాది శుభాకాంక్షలతో ..
మీ ఉత్తరాలు చేరాయి. ఆధ్యాత్మిక విష యాలలో మీరు కనబర్చే ఆసక్తి, ఉత్సుకత ఎంతో హర్షాన్ని కల్గించాయి. దాదాపు అందరి జీవితాల్లో అనేక సమస్యలు అనేక విధాలుగా బాధిస్తూ మనకు దు:ఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు సమస్యలు పూర్తిగా అదృశ్యమవటమంటూ ఉండదు. అయినా ప్రతి సమస్యకూ రెండు కోణాలుంటాయి. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది - సమస్య యొక్క జటిలత్వం మరియు ఆ సమస్యను అనుభవించే వ్యక్తి యొక్క




