లోకాన్ని మరిస్తే శోకం నశిస్తుంది.

‘‘మీ ఉత్తరాలు చేరాయి. ఆధ్యాత్మిక విష యాలలో మీరు కనబరిచే ఆసక్తి, ఉత్సుకత ఎంతో హర్షాన్ని కలిగించాయి. దాదాపు అందరి జీవితాల్లో అనేక సమస్యలు అనేక విధాలుగా బాధిస్తూ మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు సమస్యలు పూర్తిగా అదృశ్యం కావడమంటూ ఉండదు. అయినా ప్రతి సమస్యకూ రెండు కోణాలుంటాయి. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది – సమస్య యొక్క జటిలత్వం మరియు ఆ సమస్యను అనుభవించే వ్యక్తి యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఒకరికి సమస్యగా ఉన్నది వేరొకరికి సమస్యగా ఉండకపోవచ్చు. ఒక కిలో బరువు చిన్న పాప తలపై ఉంచితే అది చాలా భారంగా అనిపించదు. కారణం ఇక్కడ బరువు తగ్గటం కాదు. బరువును భరించే శక్తి పెరగటం. సమస్యలను పరిష్కరించటంలో ఈ రెండవ అంశంపై ఎక్కువ దృష్టి నిలపాలి. చాలామంది మొదటి అంశాన్ని ఎక్కువగా లెక్కలోనికి తీసుకుంటారు. దానివల్ల అనుకున్న ఫలితం ఉండదు. అందువల్ల దుఃఖం తిరిగి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది.

అందువల్ల మనమే సమస్యలకు అందనంత ఎత్తుకు మానసికంగా ఎదగాలి. ఆ విధంగా మనో పుష్పం వికసించి పరిమళ సౌరభాలను వెదజల్లడమే ఆధ్యాత్మికత అంటే. ముళ్ల మధ్య సగర్వంగా తలెత్తి ఊగే గులాబీలా జీవించాలి. ఈ ప్రయాణంలో అతి ముఖ్యమైన మజిలీ భగవంతునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండటం. ఆ తర్వాత ముఖ్యమైంది- జీవితంలో ధైర్యంగా ఉండటం. దేనికీ భయపడకూడదు. జీవితంలోని అన్ని సమస్యలు ఒక్కసారి అగ్ని కెరటంలా ఎగసి పడినా చలించకూడదు. లంఘించి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చే సింహ కిశోరానికుండే గుండె ధైర్యం కావాలి. అలాంటి నిర్భీతియే (•వ•తీశ్రీవ••అవ••) సర్వ ఉపనిషత్తుల సారాంశం. పై రెండు ఆయుధాలు మన దగ్గరున్నంత వరకు ‘ప్రశాంతత’ వీడదు. అశాంతి మన దగ్గరకు రాదు.
మన గురించి, మనకేది అవసరమో మనకంటే మనల్ని సృష్టించిన భగవంతునికి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఏది చేసినా మన మంచి కోసమే ఉంటుంది. అందుకని జరిగేదాన్నంతా ఒక ప్రేక్షకునిలా చూస్తూ అనుభవిస్తూ పోవాలి. ఎటూ తోచని పరిస్థితి ఏర్పడినపుడు మన మనస్సాక్షిని అనుసరించాలి. మనకు తోచింది చేయాలి. మనకు అలా తోచేలా చేసేవాడు ఆయనే కాబట్టి•.

మనం నడిచే దారిలో ముళ్లున్నపుడు మనం రెండు మార్గాలు అనుసరిస్తాం. ఒకటి- సాధ్యమైనంత వరకు ముళ్లను తొలగించటం.
రెండవది- చెప్పులు వేసుకుని నడవటం. రెండవ పద్ధతి మొదటి దానికంటే మెరుగైంది. అదే భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకుని, మన భారాలన్నింటిని ఆయన తలపై పెట్టి మనం హాయిగా ఉండటం. అలాంటి తైల ధారలాంటి అవిశ్రాంత ప్రశాంతి – భగవంతుణ్ణి గుడిలో నుంచి మన గుండెల్లోకి మార్చటం వల్ల వస్తుంది. సముద్రమెంత విశాలమైనదైనా భగవంతుని కృప అనే పడవలో ప్రయాణిస్తే సంసార సాగరం మనల్ని బాధించదు.
మీరు దేన్ని గురించీ విచారించకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని గడపండి. మీరు చేయగలిగిందల్లా చేస్తూ, మిగతా విషయాలను భగవంతునికి వదలి నిశ్చింతగా ఉండండి. క్షణభంగురమై, క్షణంలో ఆగిపోయే బొంగరం లాంటి ఈ జీవితంలో దేనికీ విచారించవలసిన పనిలేదు. ధైర్యంగా ఉండండి. స్వామీ వివేకానంద అంటారు.
•ఔష్ట్ర••వఙవతీ శీ••వ•• •శీ• ఎ•• ఎవ•ఱ•••వ శీఅ, × ఎవ•ఱ•••వ శీఅ •ష్ట్రవ •వ•తీ• శీ• • •ఱశ్ణీ.
అలాంటి ధైర్యం జీవితంలో అవసరం. అలాంటి ధైర్యం భగవంతునిపై, ఆయన ప్రేమపై, ఆయన చేసే పనుల్లో – అచంచల విశ్వాసం ఉండటం వల్ల వస్తుంది. మీ పొరుగు వాళ్లు, బంధువులు, స్నేహితులు మీ గురించి ఏమనుకున్నా పట్టించు కోకండి. లోకాన్ని కాసేపు మరిస్తే శోకం అదే నశి స్తుంది. ప్రశాంతితో మీ పరిణయం జరుగు తుంది. ప్ర హర్షం మీ జీవితాల్లోకి ప్రవే శిస్తుంది. మీ హృదయం మహానీయ మానవ సరస్సులో కేరిం తలు కొడ్తూ తిరిగే వినిర్మల రాజహంసలా పరు గులు తీస్తుంది. మీ ఎదలో ఎల్లలు దాటే సంతోష సౌరభ పరిమళాలు నిండుతాయి.

చేతిలో దీపమున్న వాడు చీకటికి భయపడ నట్లు మనసులో భగవంతుణ్ణి బంధించిన వానికి ఏ భయమూ జీవితంలో బాధించదు. ఏవైనా సంఘటనలు మీరనుకున్నట్లు జరగకపోతే భగవంతుణ్ణి తనకు నచ్చిన రీతిలో చేయనివ్వండి. చిన్నారి పాపకు తనకేమి మంచివో తనకన్నా అమ్మకు బాగా తెలుసు. పాపకు బొమ్మలు (ణశీశ్రీశ్రీ• •ష్ట్రఱ•ష్ట్ర స్త్రఱఙవ •వశ్రీఱస్త్రష్ట్ర•) తాత్కాలికంగా ఆనంద పర్చగలవే కాని శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. అందుకనే అమ్మ కనపడగానే అన్నీ వదలి పరుగెత్తుతుంది. అలాగ – ‘బొమ్మ’ను వదలి ‘అమ్మ’ను చేరటమే అవకాశం, ఆకుంఠిత దీక్ష ఉన్నాయి. కాబట్టి మీకు అసాధ్యం ఏదీ ఉండదు. ప్రయత్నించి చూడండి.
దీవ • శ్రీఱ••శ్రీవ ఎశీతీవ జూ••ఱవఅ•బీ •వ • శ్రీఱ••శ్రీవ ఎశీతీవ •శీశ్రీ•. •శీ• •ఱశ్రీశ్రీ •వ •ష్ట్ర•• •శీ• ••అ• •శీ •వ.
రవి రాజు గారు కలిసినపుడల్లా ‘గోపి’ గురించి జ్ఞాపకం చేస్తుంటారు. నాకు కూడా చాలా కాలంగా గోపి గారిని కలవాలని ఉంది. ఇంకా అవకాశం రాలేదు. ఒకవేళ నేను వేసవి సెలవుల్లో మద్రాసు రాగలిగితే కలవవచ్చు.
మన జీవితాల్లో మనకు ఆనందం కలిగించే విషయాల్లో అతి ముఖ్యమైంది ప్రేమ. అది మన జీవితాలకు అర్థం, పరమార్థం కల్పిస్తుంది. ప్రేమ – వివర్ణమైన జీవితాన్ని సువర్ణమయ కాంతిరేఖగా మారుస్తుంది. అది హృదయ తాపాన్ని చల్లార్చి, హృదయ దాహాన్ని తీరుస్తుంది.
మన జీవితాల్లో చాలామంది మనపై ప్రేమా మృతాన్ని కురిపిస్తారు. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే – మనల్ని ఎంతగా ప్రేమించే వారున్నా, అది తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కాని శాశ్వత ఫలితాన్నివ్వదు. వారి నుండి దుఃఖం పూర్తిగా దూరమవదు. ఇది ప్రాపంచికమైన ప్రేమకుండే సహజ లక్షణం. మనల్ని నిజంగా ప్రేమించగల్గి, ద్వేషించినా సరే, ఆదరించగలిగేవాడు – ఒక్క భగవంతుడు మాత్రమే. కాని ఈ విషయం చాలా మంది గ్రహించరు. ఇది అర్థం కావటానికి చాలా వివేకం, విచక్షణ అవసరం.
•ష్ట్రవ శీఅశ్రీ• శీఅవ •ష్ట్రశీ తీవ•శ్రీశ్రీ• శ్రీశీఙవ• •శీ• •అ• ••అ శ్రీశీఙవ •శీ• ఱ• శీఅశ్రీ• +శీ• •అ• అశీఅవ వశ్రీ•వ. •వ ఱ• •••ష్ట్రవతీ •అ• ఎశీ•ష్ట్రవతీ తీశీశ్రీశ్రీవ• ఱఅ•శీ శీఅవ.
ఈ విషయం గ్రహించిన నాడు మన సర్వదుఃఖాలు దూరమవుతాయి. ప్రాపంచిక ప్రేమలో కనీకనిపించకుండా దుఃఖం దాక్కుని ఉంటుంది. ఎర (••ఱ•) కలిగించే ఆనందంలో ‘చేప’కు దాని వెనక దాక్కున్న ‘గాలం’ కని పించదు. అందుకే ఎలాంటి నిష్కల్మషమైన ప్రాపం చిక ప్రేమ అయినా సరే పూర్తి శాంతినివ్వదు. భగవత్‍ ప్రేమ ఎల్లప్పుడూ మనపై కుంభవృష్టిలా కురుస్తూనే ఉంటుంది. కాని, మనమే దాన్ని గ్రహించే స్థితిలో ఉండం. కారణం మన చుట్టూ ఆవరించి ఉండే మాయ. కాని ఒక్కసారి భగవత్‍ ప్రేమామృత రసధారలో తడిచిన తర్వాత మనం దేన్నీ యాచించం. అసలు ప్రపంచంలో మనం వాంఛించవలసిన వస్తువేదీ లేదన్న విషయాన్ని గ్రహిస్తాం.
ఈ సృష్టి రహస్యాలన్నీ చాలా సూక్ష్మమైనవి కాబట్టి మన మేధస్సుకు అంతగా అర్థం కావు. ‘మాయ’ వలలో నుంచి జాగ్రత్తగా దాటుకుని, మన అనుభవాల్ని ఆధ్యాత్మిక కోణంలోంచి వడ బోస్తూ, వివేకంతో ఒక శాస్త్రవేత్తలా జీవితాన్ని పరిశీలించాలి. నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఒక్కటి నిజమనిపిస్తూంది. ఈ సర్వ చరాచర సృష్టిలో ఎంత అందమైన, ఆనందాన్నిచ్చే సంతృప్తి – శాంతినిచ్చే వ్యక్తియైనా, వస్తువైనా – అదంతా కేవలం మన ‘భ్రమ’ మాత్రమే. ఈ ప్రపంచంలో మనకు ఆనందాన్నిచ్చే శక్తి ఏ వస్తువుకూ, వ్యక్తికీ లేదు. ఇదొక సత్యం. కాని ఆ శక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. అదే మాయ. అందుకే – మనకు ఆనందంగా ఉండే వ్యక్తి ఎవ్వరూ కనపడరు. ఒక్క జ్ఞాని తప్ప, ఎంత ధనికుడైనా, విద్యావేత్త అయినా, అధికారియైనా, ఎంతగా కీర్తి కాంత కౌగిట్లో ఉన్నా, ఎంతటి ప్రేమించే వాడైనా, ప్రేమింపబడే వాడైనా, అందం ఉన్నా, అవధులు మించే ఐశ్వర్యం ఉన్నా – హృదయాంతరాల్లో దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంటుంది. కొంతమంది కనిపించేలా ఏడుస్తారు. కొంతమంది నవ్వు ముఖానికి పులుముకొని కనపడనట్లు ఏడుస్తారు. ఆకాశంలో లేని ‘నీలిరంగు’ ఉన్నట్లు ఎలా కనిపిస్తుందో, ప్రాపంచిక విషయాల్లో అలాగే, లేని ఆనందం, ఉన్నట్లు కనబడుతుంది. ఆ లేని వస్తువు కోసం అందరూ పరుగెత్తి అలసి పోతారు. చివరికి అది లభించదు. అసలు అది లేదు కాబట్టి. ఆకాశంలో నీలిరంగు లేదు. జీవి తంలో ఆనందం లేదు. ఆనందం – జీవితానికి అతీతంగా ఉండే భగవంతునిలో వెతుక్కోవాలి.
ఈ జీవన నాటకంలో పాత్రధారులుగా మన పాత్రను, అది ఎలాంటిదైనా, పాత్రలు కలిగించే రాగబంధాల్లో చిక్కుకోకుండా – నటించాలి. మన అసలు స్వరూపాన్ని మరచిపోకూడదు. నాటకం లోని దుఃఖాలు మనల్ని బాధించకూడదు. నాట కంలో సీత పాత్రను పోషించే వ్యక్తి – తాను ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తుంది. అయినా నిజంగా తాను ఏడవటం లేదు. నాటకంలో శివధనుర్భంగం తర్వాత, పరిణయం జరిగినపుడు – సీత ఆనందిస్తుంది. మనల్ని ఆనందింప జేస్తుంది. అయినా నిజంగా ఆమె ఆనందించటం లేదు. మనం కూడా జీవితంలో అలాగే నడుచు కోవాలి. నాటకంలోని రాముడుని కాకుండా అసలు రాముణ్ణి వెతుక్కోవాలి.
అసలు ప్రపంచంలో వాంఛించ తగిన ఒకే ఒక్క వ్యక్తి ‘భగవంతుడు’. ఆయన ‘ప్రేమ’కై మనం ఆరాట పడాలి. పోరాడాలి. దాన్ని సాధించి ఆనం దించాలి.
ఎప్పుడూ నిర్భయంగా ఉండండి.

మీరు దేన్ని గురించీ విచారించకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని గడపండి. మీరు చేయగలిగిందల్లా చేస్తూ, మిగతా విషయాలను భగవంతునికి వదలి నిశ్చింతగా ఉండండి. క్షణభంగురమై, క్షణంలో ఆగిపోయే బొంగరం లాంటి ఈ జీవితంలో దేనికీ విచారించవలసిన పనిలేదు. ధైర్యంగా ఉండండి

ఎళ్లవేళలా భగవంతునిపై అచంచల విశ్వాసం ఉంచండి.
మీకు చేయాలనిపించింది, చేయగలిగినంత వరకూ చేస్తూ – ఒక ప్రేక్షకునిలా జీవితంలో అన్ని సంఘటనలను దర్శిస్తూ వెళ్లండి.
ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ ఉండండి.
మీరు కావాలనుకున్న ఆనందం మీదవు తుంది. ‘గోపి’ గార్కి, రవిరాజు గారికి ఉగాది శుభా కాంక్షలు అందజేయండి.

మీ
శ్రీరామ్‍
(తన మిత్రుడైన విజయ్‍కుమార్‍ గారికి మనో ధైర్యం కల్పిస్తూ శ్రీరామ్‍ గారు నిజామాబాద్‍ నుంచి 1991, మార్చి 5న రాసిన లేఖ..

Review లోకాన్ని మరిస్తే శోకం నశిస్తుంది..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top