నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వు కావాలని.
రజనీ ముఖంబున రాగంబు మెఱసెఁ గలువ పుట్టింటిలోఁ గలకల విరిసె దివ్య సౌధంబులో దీపాలు వెలిఁగె గర్భాలయంబులో గంటలు మ్రోఁగెఁ బ్రాక్సతీమణి పట్టె బంగారు గొడుగు విశ్వ సుందరి వీచె విరి చామరంటు భపద ఖండానంద భవనాంగణమునఁ బడిగాపు పడియుండె బ్రకృతి గణంబు - శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ ఏమ్మా! ఎలా ఉన్నావు? ఫోన్లో నీ గొంతు విన్నపుడు, నీ పాట విన్నంతటి ఆనందం కలి గింది. చెల్లాయి వసంత ఎలా ఉంది? ‘విశాల’కు రాస్తున్న ఉత్తరం త్వరలో చేరుతుంది.




