బంగారం పంట
ఒకరోజు తైమూర్ పొరుగూరికి వెళ్తున్నాడు. దారిలో ఊరి బయట నసీరుద్దీన్ నేలను తవ్వుతూ కనిపించాడు. తైమూర్ అతడిని పిలిచి ‘‘అక్కడేం చేస్తున్నావ్?’’ అని అడిగాడు. నసీరుద్దీన్ గొప్ప చమత్కారి. మాటకారి. అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. తైమూర్‍ని కూడా ఆట పట్టించాలి అనుకున్నాడు. ‘‘పాదుషా గారూ! నేను బంగారు నాణేలను పొలంలో నాటుతున్నాను. ఇవి నావి కూడా కావు. అప్పు తెచ్చి నాటుతున్నాను’’ అన్నాడు. ‘‘ఎందుకలా చేస్తున్నావ్!’’ అని అడిగాడు తైమూర్. ‘‘నేను నాటే