భరతజాతి మనది. నిండుగ వెలుగుజాతి మనది
‘తెలుగుపత్రిక’తో డాక్టర్ దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్ మాటామంతి ‘మానవజన్మ దేవుడిచ్చిన వరం’ అని చెప్పే ఆయన ఆ విలువైన వరాన్ని నిజం చేసుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. నిలువెత్తు భారతీయతకు ప్రతిబింబంలా కనిపించే ఆయన.. సంస్క•తీ సంప్రదాయాలకు ప్రాణమిస్తారు. ఆధ్యాత్మిక సిద్ధాంతాల అనుభవసారంతో, నీతి నిజాయితీల ఆదర్శ భావంతో విదేశీగడ్డపై భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను చాటుతున్న ఆయన.. దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్. ఆంధప్రదేశ్‍లోని క•ష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించిన ఆయన వైద్యునిగా




