ఏది ధర్మం?
శరీరం, మనసు, బుద్ధి ఈ మూడింటి ద్వారా జరిగే వేదశాస్త్ర విహితమైన సత్కర్మను ధర్మంగా పేర్కొనడం భారతీయ తత్వశాస్త్రంలో మనం చూడగలం. తనకు, ఇతరులకు ఏ పని వల్ల కీడు జరగదో, ఏ భావం వల్ల ప్రకృతికి, సకల జీవరాశులకు హాని జరగదో దాన్ని ధర్మంగా పరిగిణించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, మహర్షుల ప్రబోధాలు దేశ, కాల , జాతి, కుల, వర్గ, మత విచక్షణలతో నిమిత్తం లేకుండా




