యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారి నిత్యాన్నదాన కేంద్రం అందుబాటులో ఉంది. త్వరలో ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన భవనం నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రస్తుతానికి నిరతాన్నదానం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇక్కడకు నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా భోజన సదుపాయం కల్పించడానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భోజనశాలను కరివెన సత్రం నిర్వహిస్తోంది. అన్నదానమనే పవిత్ర కార్యాన్ని కరివెన నిత్యాన్నదాన సత్రం దాదాపు

తిరుమల దేవదేవుని దర్శనం అద్భుతమైతే..

అక్కడి శ్రీవారి భోజనశాలలో వడ్డించే అన్న ప్రసాదం మహాద్భుతం. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ వడ్డీకాసుల వాడి అన్న ప్రసాదాన్ని రుచి చూడకుండా వెనక్కి వెళ్లరు. ఇక్కడ నిత్యాన్నదాన నిలయాన్ని 1985లో ప్రారంభించగా, తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ను 2011లో ప్రారంభించారు. రోజూ వేలమందికి ఇక్కడ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా పూర్తిగా భక్తుల విరాళాలతోనే నడుస్తోన్న బృహత్కార్యక్రమం. అలాగే మరెన్నో సత్రాలు, నిత్యాన్నదాన కేంద్రాలు

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే!

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే! మొదట కర్నూలు జిల్లాలోని ప్రశాంతమైన కరివెన గ్రామంలో ఒకరిద్దరితో మొదలైన అన్నదాన మహత్కార్యం నేడు శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీజం పడింది ఇక్కడే. నాడు రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అడవి మార్గాన శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే వారు. ఆకలిదప్పులతో అలసిసొలసిన భక్తులకు ఇన్ని నీళ్లిచ్చి.. ఇంత కడుపు

కాశీలో అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మోక్షదాయకం

ఇక్కడ చేసే అన్నదానం కానీ లేదా అన్నదాన నిమిత్తం విరాళాలు ఇవ్వడం, వస్తు సామగ్రి తదితర రూపాల్లో సహాయం అందివ్వడం పదింతల ఫలాన్నిస్తుంది. జన్మజన్మల పాపాలను పోగొట్టి శివసాయుజ్యాన్ని (మోక్షం) ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి కొలువైన క్షేత్రం కావడంతో ఇక్కడ అన్నదానం, అన్నదానానికి అవసరమైన విరాళాలు అందించడం విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలను అందిస్తుంది. పరమేశ్వరుడు బిక్షువై కాశీ పురవీధుల్లో తిరుగుతుంటాడనీ, ముక్కోటి దేవతలు, దేవగణాలు, రుషులు మధ్యాహ్నం కాశీ క్షేత్రంలో బిక్షకొస్తారని

ధర్మయ్య పరీక్ష

రామాపురం గ్రామంలో ఉండే ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాకుండా, పేరుకు తగినట్టు మంచి ధర్మబుద్ధి గలవాడు. ఆయనకు పెళ్లీడుకు వచ్చిన విశ్వం అని ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. విశ్వం రూపవంతుడే కాక, మంచి గుణవంతుడు కూడా. అతడికి తగిన రూపవతి, గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు. ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడు ఉండేవాడు. వెంకప్ప జరీచీరలను ఇంట్లో మగ్గాల మీద నేయించి, చుట్టపక్కల

Top