అక్కడి శ్రీవారి భోజనశాలలో వడ్డించే అన్న ప్రసాదం మహాద్భుతం. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ వడ్డీకాసుల వాడి అన్న ప్రసాదాన్ని రుచి చూడకుండా వెనక్కి వెళ్లరు. ఇక్కడ నిత్యాన్నదాన నిలయాన్ని 1985లో ప్రారంభించగా, తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ను 2011లో ప్రారంభించారు. రోజూ వేలమందికి ఇక్కడ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా పూర్తిగా భక్తుల విరాళాలతోనే నడుస్తోన్న బృహత్కార్యక్రమం. అలాగే మరెన్నో సత్రాలు, నిత్యాన్నదాన కేంద్రాలు తిరుమలలో ఉన్నాయి. తాజాగా
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం వారు కూడా ఇక్కడ భక్తుల విరాళాలతో, దాతల సాయంతో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి వచ్చే భక్తులు ఆకలితో ఉండకూడదని, ఆ దేవదేవుని దర్శనం చేసుకుని.. ఆయన అన్నప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా ఇంటిముఖం పట్టాలనే సంకల్పంతో కరివెన నిత్యాన్నదాన సత్రం తనవంతు ప్రయత్నాలకు తోడు భక్తుల నుంచి విరాళాలను కోరుతోంది.
అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రంలో భక్తులకు రుచికరమైన, పరిశుభ్రమైన సాత్విక ఆహారాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ చేసే అన్నదానం.. స్వీకరించే భోజనం.. శ్రీవారి అనుగ్రహ ప్రసాదమే. కనులారా వేంకటేశ్వరుడిని దర్శించుకుని, నోరారా అన్న ప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తిగా, కృతజ్ఞతతో భక్తుల మనసు నింపేందుకు కరివెన నిత్యాన్నదానం సత్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇక్కడ స్వీకరించిన అన్నప్రసాదం బలాన్ని, శక్తిని, తెలివితేటలను పెంచుతుందని అంటారు. దానం చేసేవారు, దానం స్వీకరించే వారు.. ఇద్దరూ దైవత్వాన్ని పొందుతారట.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి
ఇది పురాణోక్తి. ఒక్కసారి ఏడుకొండలెక్కి శ్రీనివాసుడిని దర్శించుకున్న వాళ్లెవరైనా ఈ మాట నిజమనక పోరూ.. స్వామిని పునర్దర్శన ప్రాప్తినివ్వమని వేడుకోకా పోరు!
ఏడుకొండల వాడిని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఆ నామం ఎన్నిసార్లు పలికినా ఇంకా ఇంకా పలకాలనే అనిపిస్తుంది. శ్రీనివాసుడి మహత్యమే అది. మొక్కించుకోవడంలో కాదు.. మొక్కులు తీర్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తిరుమల కొండకు చీమలదండులా సాగే భక్తులే అందుకు నడిచే సాక్ష్యాలు.
బ్రహ్మ కడిగిన బంగారు పాదం ఆయనది. అందరికీ అభయమ్మున్నిచ్చే చల్లని చేయీ.. ఆయనదే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే కనిపిస్తాడా బ్రహ్మాండ నాయకుడు. సాక్షాత్తూ మహావిష్ణు స్వరూపంగా, కలియుగంలో భక్తుల కడగండ్లు తీర్చే స్వామిగా, వేంకటాద్రి మీద కొలువైన దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు కీర్తించి తరించిన ఆ ప్రాంతమంతా పరమ పవిత్రం. నిత్యం గోవింద నామాలు ప్రతిధ్వనించే ఆ చోటు ఇల వైకుంఠం.
చీమలపుట్టలో దర్శనమిచ్చి..
తిరుమల క్షేత్ర ప్రశస్తి వరాహ, బ్రహ్మాండ, భవిష్యోత్తర.. ఇలా వివిధ పురాణాల్లో కనిపిస్తుంది. శ్రీ వేంకటాచల మహాత్మ్యం ప్రకారం.. గోపీనాథ దీక్షితులు అనే వైఖానస అర్చకుడూ, రంగనాథుడు అనే బాలుడూ కలిసి స్వామి పుష్కరిణి సమీపంలో, చీమలపుట్టలో శ్రీవారి విగ్రహాన్ని గుర్తించారట. అక్కడే స్వామిని ప్రతిష్ఠించి, చిన్న ఆలయాన్ని నిర్మించి అర్చన చేశారట. ఇప్పటికీ గోపీనాథుడి వంశస్తులే స్వామి సన్నిధిలో అర్చకత్వం చేస్తున్నారు. రంగనాథుడు తర్వాతి జన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని అంటారు. ఇక, స్వామిని దర్శించుకునే వారు ముందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలనేది పురాణ వాక్కు.
అటు వరదరాజు.. ఇటు యోగనారసింహుడు
తిరుమల ఆలయం ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి.
మహా ద్వారం లోపలికి ప్రవేశించిన తరువాత విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయం మూలన శ్రీవరదరాజ స్వామి ఆలయం ఉంది.
ఇక్కడి యోగ నరసింహాలయం కూడా అతి పురాతనమైనది.
వకుళాదేవితో పాటు స్వామిని పూజించిన భాష్యకారులు కూడా ఆలయ ప్రాంగణంలోనే కొలువయ్యారు.
బంగారు వాకిలి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది.
ఆనంద నిలయం గోపురంపైన ఉండే విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఏవైనా కారణాల వల్ల గర్భగుడిలోని స్వామిని దర్శించుకోలేని వారు విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా చాలని చెబుతారు.
కొండంత దేవుడు
కొండంత దేవుడన్న పేరు కొండల్లో నెలకొన్న కోనేటిరాయుడికి చక్కగా సరిపోతుంది. ఆనంద నిలయంలో వెలసిన మూలవిరాట్టు ఎత్తు ఎనిమిది అడుగులకు పైనే ఉంటుంది మరి! ఒకపక్క వరద హస్తం.. మరోపక్క కటిహస్తంతో నిశ్చలంగా కనిపిస్తుందా దివ్యమంగళ మూర్తి. ఈయనను పల్లవ, చోళ, విజయనగర తదితర ఎన్నో రాజవంశాలకు చెందిన సామ్రాజ్యాధీశులు పూజించారు. ఈ ఆలయ నిర్మాణమూ క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందినదని అంటారు.
గర్భగుడిలో ఐదు మూర్తులు
తిరుమల కొండల్లో వెలసిన శ్రీనివాసుడిని స్వయంభూగా చెబుతారు. గర్భగుడిగా పిలిచే ఈ గది లోపల స్వామితో పాటు మరో నాలుగు మూర్తులు కూడా ఉంటాయి. కౌతుక బేరం, బలి బేరం, స్నపనబేరం, ఉత్సవబేరంగా పిలుస్తారా విగ్రహాలను.
ఙ పల్లవ యువరాణి సామవై చేయించిన వెండి శ్రీనివాసుడికి కౌతుకబేరంగా పిలుస్తారు. ఈయననే భోగ శ్రీనివాసుడనీ అంటారు. రోజువారీ దీపారాధన, అభిషేకం, నైవేద్యం, ఏకాంతసేవ వగైరాలన్నీ ఈ భోగ శ్రీనివాసుడికే.
ఙ ఇక బలిబేరంగా పిలిచే స్వామిని కొలువు శ్రీనివాసుడని అంటారు. ఈయనను రోజూ ఆస్థాన మండపంలోకి తీసుకువచ్చి పంచాంగ శ్రవణం జరిపిస్తారు. ముందురోజు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కలు చెప్పి అప్పగిస్తారు.
ఙ 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా వ్యవహరించిన ఉగ్ర శ్రీనివాసుడిని ‘స్నపనబేరం’ అంటారు. ఒకసారి ఊరేగింపు సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈయనకా పేరు వచ్చింది. ఏడాదికి ఒకసారి సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాన్ని సర్వాలంకారాలతో ఊరేగింపునకు తీసుకువెళ్లి మళ్లీ అంతరాలయంలోకి తీసుకుని వస్తారు. ఉగ్ర శ్రీనివాసుడిని బయట ఊరేగింపులకు తీసుకువెళ్లడం మానేసినప్పటి నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఉత్సవ సేవలు చేస్తున్నారు. మూడు అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్నే మనం బ్రహ్మొత్సవాల సమయంలో దర్శించుకునేది. ప్రస్తుతం తిరుమల శ్రీవారిని ఏటా దర్శించుకునే వారి సంఖ్య దాదాపు మూడు కోట్లకు పైనే. ఇలా భక్తజనం పోటెత్తడంతో స్వామికి కునుకే బంగారమవుతోంది. ఏకాంతసేవ తరువాత ఆలయాన్ని మూసి ఉంచేది నిండా రెండు గంటలే మరి!.
నిత్యకల్యాణం
నిత్య కల్యాణం పచ్చతోరణం అనే మాట అచ్చంగా సరిపోతుంది తిరుమల విషయంలో. వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి స్వామి వారికి నిత్య కైంకర్యాలు జరుపుతారు. ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంతసేవ వరకూ ఎన్నో విశేష సేవలు నిర్వహిస్తారు. అందులో సుప్రభాత సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవల్లాంటి వాటిలో నియమిత రుసుము చెల్లించి భక్తులు పాలుపంచుకోవచ్చు.
బ్రహ్మ ప్రారంభించిన బ్రహ్మోత్సవాలు
భవిష్యోత్తర పురాణం ప్రకారం స్వామి బ్రహ్మోత్సవాలను మొట్టమొదట సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదలుపెట్టాడట. ఇక్కడ ఏటా సాధారణ బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక, తిరుమలలో స్వామి ప్రసాదంగా అందించే లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దాని రుచికి ప్రపంచవ్యాప్తంగా పేరు. ఈ లడ్డూకు తిరుమల తిరుపతి దేవస్థానం పేటెంట్ హక్కులను కూడా సాధించుకుంది.
కరివెన నిత్యాన్నదాన సత్రం
తిరుపతి చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
20-3-4/7ఏ, శివజ్యోతి నగర్, పోలీస్‍స్టేషన్ ఎదురుగా,
తిరుమల బైపాస్ రోడ్డు, తిరుపతి, ఆంధప్రదేశ్- 517507
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
83339 07809, 83339 07810
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ నంబర్: 257112010001201
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్: యూబీఐఎన్0825719
























































































































































































































































































































































































































Review తిరుమల దేవదేవుని దర్శనం అద్భుతమైతే...