జాతి ఆ’మో’దించిన నేత

ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి, అంతటా తానై నిలవాలనే సంకల్పం, దీక్ష, పట్టుదల ఒక మనిషిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. అలాంటి నిరంతర దీక్షాశీలి, నిరంతర అన్వేషి, ఎవరికీ తలొగ్గని నిజమైన రాజకీయవేత్త, తాననుకున్నది సాధించి తీరాలన్న పట్టుదల… ఇవన్నీ కలగలిస్తే.. నరేంద్ర దామోదరదాసు మోదీ!. ఒక అడుగుకు ఇంకో అడుగు తోడయితేనే విజయపథ సోపానాలధిరోహించగలరు. అలా ఒక్కొక్క అడుగును మిళితం చేస్తూ అట్టడుగు ప్రచారక్‍ స్థాయి నుంచి దేశ ప్రధానిగా అత్యున్నత శిఖరాగ్రానికి చేరిన ధీరోదాత్తుడు, నిరంతర అన్వేషి భారత ప్రధాని నరేంద్రమోది.
స్వచ్ఛభారత్‍ అంటూ ఎలుగెత్తినా, డిజిటల్‍ ఇండియా అంటూ సాంకేతికతను ఒడిసిపట్టినా, డీమానిటైజేషన్‍ అంటూ నల్లకుబేరుల గుండెల్లో దడపుట్టించినా అది మోదీకే చెల్లింది. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన ఫోర్బస్ మ్యాగజైన్‍లో స్థానం సంపాదించినా, టైమ్స్ పర్సన్‍ ఆఫ్‍ ది ఇయర్‍గా ఖ్యాతికెక్కిన ఘనత కూడా భారతీయ ప్రధానమంత్రుల చరిత్రలో మోదీదే కదా! టీ అమ్ముకునే సాధారణ కార్మికుని స్థాయి నుంచి దేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆ ఎదగడంలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల చూస్తే ఔరా అనిపించక మానదు.
చిన్ననాటి సంగతులు
నరేంద్ర దామోదరదాస్‍ మోదీ గుజరాత్‍లోని వడ్‍నగర్‍ అనే ఒక చిన్న పట్టణంలో, 1950 సెప్టెంబర్‍ 17న నిరుపేద కుటుంబంలో జన్మించారు. దామోదరదాస్‍ మూల్‍చంద్‍, హీరాబెన్‍ మోదీలకు మూడో సంతానం. నిరుపేద కుటుంబమే అయినా, ప్రేమానురాగాలకు కొదవ లేని వాతావరణంలో పెరిగారు. కష్టాలతోనే సహవాసం చేసిన మోదీ శ్రమించి పనిచేసే తత్వాన్ని అలవరుచుకున్నారు. చిన్నతనంలోనే తండ్రితో పాటు వడ్‍నగర్‍ రైల్వేస్టేషన్‍లో టీ అమ్మేవారు మోదీ. తరువాత తన అన్నతో కలిసి బస్‍స్టేషన్‍లో టీస్టాల్‍ పెట్టుకున్నారు. 1967లో స్కూలు చదువు అయిపోగానే, ఇంటిని వదిలిపెట్టారు మోదీ. దేశమంతా తిరిగారు. వివిధ ప్రదేశాలు, రాష్టాల్రు, ప్రాంతాలలోని సంస్క•తీ సంప్రదాయాలను
గమనించారు. అంతేకాదు, ఇదే సమయంలో హిమాలయాలకు వెళ్లి, అక్కడ ఉన్న సాధువులతో రెండు సంవత్సరాలు గడిపారు. తరువాత సన్యాసిగా మారటానికి బేలూరు, రాజ్‍కోట్‍లలోని రామక•ష్ణ మఠాలకు వెళ్ళారు. కానీ వారు అందుకు అంగీకరించకపోవడంతో తిరిగి వడ్‍నగర్‍, తన కుటుంబసభ్యుల వద్దకు వచ్చారు. కానీ అక్కడా రెండు వారాలకు మించి కుటుంబసభ్యులతో గడిపింది లేదు. ప్రజలకు ఏదో చేయాలి అనే తపనే మోదీని ఇంట నిలువకుండా చేసింది. తిరిగి తన గమ్యాన్ని వెతుక్కుంటూ అహ్మదాబాద్‍ వెళ్ళారు. తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుని చిన్న వయసులోనే మోదీ ప్రజాసేవలో ప్రవేశించారు.
ప్రజానాయకుడు
ప్రారంభ సంవత్సరాలలో ఆయన జాతి నిర్మాణానికి క•షి చేస్తున్న రాష్టీయ్ర స్వయం సేవక్‍ సంఘ్‍ (ఆర్‍ఎస్‍ఎస్‍)తో కలిసి పనిచేశారు. ఆర్‍ఎస్‍ఎస్‍లో 1971లో ప్రచారకునిగా చేరారు. అలా ఒక ప్రచారకుని స్థాయి నుంచి కార్యకర్తగా, ఆర్గనైజర్‍గా, రాష్ట్రం నుంచి దేశవాళీ రాజకీయాలలోకి ప్రవేశించి తన సత్తా చాటారు. క•షితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి సరైన అర్థాన్ని చెప్పారు. సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి, వారి బాగోగులకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలతో మమేకం కావడం, వారి ఆనందంలోను, విచారాలలోను కూడా పాలుపంచుకోవడంలో మోదీ ఆనందాన్ని అనుభవిస్తారు.
ప్రసంగం.. గంగా ప్రవాహం
మోదీ గురించి ముందుగా చెప్పుకోవలసింది ఆయన వాగ్ధాటి! నిరంతర ప్రవాహంగా సాగే ఆయన ప్రసంగాన్ని ఎవరైనా సరే చెవులు రిక్కించి వినాల్సిందే! అందులో లీనమవ్వాల్సిందే! యువతను
ఉర్రూతలూపాలన్నా, మహిళల మనసును గెలవాలన్నా, వ్యాపారులకు భరోసా ఇవ్వాలన్నా అది ఒక్క మోదీకే చెల్లు. కేవలం తన వాక్ప్రవాహం వల్లనే ఆయన ఈ స్థాయికి చేరుకోగలిగారంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకంగా కమ్యూనికేషన్‍లో చేసిన కోర్సు కూడా ఆయనకు ఉపకరించింది.
సోషల్‍ మీడియానే వారధి
ప్రజలతో నిరంతరం అనుసంధానమై
ఉండేందుకు ఆయన సాంకేతిక విజ్ఞానాన్ని వారధిగా చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశేషమైన మక్కువ గల నాయకునిగా మోదీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజల జీవితాల్లో మార్పునకు కూడా వెబ్‍నే వారధిగా ఎంచుకున్నారు. ఫేస్‍బుక్‍, ట్విట్టర్‍, గూగుల్‍ ప్లస్‍, ఇన్‍స్టాగ్రామ్‍, సౌండ్‍ క్లౌడ్‍, లింక్‍డ్‍ ఇన్‍, వీబో వంటి భిన్న సామాజిక మీడియా వేదికలపై ఆయన చురుగ్గా ఉంటూ, ప్రజలతో భావాలు పంచుకుంటూ ఉంటారు.
ఏ దేశంలో ఉన్నా, ఏ యాత్రలో ఉన్నా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ట్వీట్లతో తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంతలా వాడుకున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్రమోదీ అంటే అతిశయోక్తి కాదు. సోషల్‍ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా చరిత్ర స•ష్టించారు.
సాహిత్యాభిలాషి
రాజకీయాలే కాదు, నరేంద్రమోదీకి రచనాభిలాష కూడా మిక్కుటంగానే ఉంది. ఆయన కవిత్వంతోపాటు పలు గ్రంథాలు రచించారు. అన్నీ కూడా తన మాత•భాష గుజరాతీలోనే. ఆయన రచించిన కవితలు ఆయనలోని సున్నిత మనస్సుకి తార్కాణాలు. తనలోని భావాలకు, ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చారు ఆయన. సంస్క•తీ సంప్రదాయాలు, గ్రామీణ నేపథ్యం, ప్రక•తి మేళవింపు అన్నీ ఆయన కవితల్లో కనిపిస్తాయి.
యోగాతో దినచర్య ఆరంభం..
మోదీ దినచర్య యోగాతో ప్రారంభం అవుతుంది. క్షణం తీరిక లేకుండా సాగిపోయే ఆయన రోజువారీ కార్యకలాపాలలో కూడా ప్రశాంతంగాను, ద•ఢచిత్తంతోను వ్యవహరించడానికి యోగా ఆయనకు ఉపయోగపడుతోంది. ప్రపంచం యావత్తు సంవత్సరంలో ఒకరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలన్న మోదీ పిలుపునకు ఐక్యరాజ్యసమితిలో విశేష స్పందన లభించింది. ప్రపంచంలోని 177 దేశాలు ఒక్కటిగా నిలిచి జూన్‍ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
మాతృభాషలో సంతకం
మోదీ తన సంతకాన్ని మాత•భాషలో చేస్తారు. ఎప్పుడూ ఎక్కడా ఆయన ఆంగ్లంలో సంతకం చేసినట్లు కనబడదు. ఇందులో కూడా మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అది అఫీషియల్‍ ఫైలైనా, అంతర్జాతీయ ఒప్పందాలైనా ఏవైనా కానీ, తన సంతకం మాత•భాషలోనే ఉంటుంది.
విదేశాలతో స్నేహ సంబంధాలు
దేశ ప్రధానిగా దేశాన్ని అగ్రపథాన నిలపడమే కాదు.. భారతీయ ఖ్యాతిని విదేశాల్లో ఘనంగా చాటడంలోనూ నరేంద్ర మోది సఫలీకృతులయ్యారు. ఆయన మరే భారత ప్రధాని చేయని, చేయలేనన్ని విదేశీ పర్యటనలను చేశారు. వెళ్లిన ప్రతిచోట దేశ సార్వభౌమత్వాన్ని చాటడమే కాక, ఆయా దేశాలతో సామరస్యపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడంలో విజయవంతమయ్యారు. ఒకసారి ఆయన ఉన్నట్టుండి పాకిస్థాన్‍కు వెళ్లి నవాజ్‍ షరీఫ్‍కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. ఇక, ఆయన 2015, నవంబరు వరకు దాదాపు 15కి పైగా దేశాల్లో పర్యటించారు. ఆయన సందర్శించిన దేశాల్లో అగ్రరాజ్యాలతో పాటు సామాన్య దేశాలూ ఉన్నాయి. సామాన్య దేశాలకు చేయూత అందించడం, అగ్రదేశాలకు స్నేహ హస్తం చాటడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రధాని అయ్యాక మియన్మార్‍, శ్రీలంక, నేపాల్‍ వంటి పొరుగు దేశాలు గరిష్ఠ స్థాయిలో భారత్‍ నుంచి లబ్ధి పొందాయి. అవి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు భారత్‍ తరపున మోది అందించిన సహాయం ఎనలేనిది.
ప్రజాసమస్యలే తన సమస్యలుగా
దేశం ప్రగతిపథంలో నడవాలంటే చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దిశగా దేశాభివ•ద్ధికి అనుగుణంగా ఎన్నో అభివ•ద్ధి పథకాలను ప్రవేశపెట్టారు మోదీ. గుజరాత్‍ సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఆయనది. గుజరాత్‍ను దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టారు. ఆ రాష్టాన్న్రి దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దేశ ప్రధాని స్థానంలో దేశ అవసరాలకు, అభివ•ద్ధికి అనుగుణంగా మార్పులు
చేర్పులు చేస్తూ, ప్రపంచదేశాలతో మైత్రిని కొనసాగిస్తూ వివిధ దేశాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో అందెవేసిన చేయిగా చెప్పుకోవచ్చు.
చాయ్‍పే చర్చా, మనకీబాత్‍ వంటి కార్యక్రమాలతో దేశ మారుమూల ప్రజానీకంలోకి చొచ్చుకువెళ్ళిన ఘనత మోదీది. ప్రజా సమస్యల పట్ల తానెంత శ్రద్ధ చూపుతున్నారో అనేందుకు ఈ కార్యక్రమాలే అద్దం పడతాయి. ఆఖరికి తమ సమస్యలను తెలుపుతూ రాసిన ఉత్తరాలకు కూడా మోది అంతే ప్రాముఖ్యం ఇస్తారనడానికి ఇటీవల జరిగిన ఓ సంఘటన అద్దంపడుతుంది. మహారాష్ట్రలోని పూనేకి చెందిన ఆరేళ్ల చిన్నారి వైశాలి యాదవ్‍ ‘మోదీజీ నన్నాదుకోండి’ అంటూ రాసిన లేఖకి వెంటనే స్పందించారు. దాంతో ఆమెకు ఆపరేషన్‍ విజయవంతంగా పూర్తయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో!
సెలవులు లేవు
సాధారణంగా ప్రతీ వ్యక్తీ ఏదో ఒక సమయంలో ఎంతో కొంత విశ్రాంతి కోరుకుంటాడు. కానీ మోదీజీకి మాత్రం సెలవులు లేవు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన సెలవుల మీద ఎక్కడికీ వెళ్లింది లేదు. అంతటి దీక్షాపరుడు, నిరంతర శ్రమజీవి.
అవార్డులు రివార్డులు
ఇండియా టుడే పత్రిక 2007లో నిర్వహించిన సర్వేలో ఇండియాలోనే ద బెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎఫ్‍డీఐ మ్యాగజైన్‍, 2009లో ఎఫ్‍డీఐ పర్సనాలిటీ ఆఫ్‍ ద ఇయర్‍’ అ•ర్డుతో ఆసియానుంచి మోదీని సత్కరించారు. మొట్టమొదటిసారిగా ఒక భారతీయ ప్రధానమంత్రిగా టైమ్స్ మ్యాగజైన్‍ కవర్‍పేజీపై దర్శనమిచ్చిన ఘనత మోదీదే! 2012 మార్చి సంచికలో ఆయన ఫోటో కవర్‍పేజీని ఆక్రమించింది.
ప్రతి సంవత్సరం ఫోర్బస్ మ్యాగజైన్‍ ప్రచురించే ప్రపంచ శక్తిమంతమైన వ్యక్తుల లిస్టులో మోదీ 2014 సంవత్సరంలో 15వ స్థానంలో నిలిచారు.
ధైర్యం, దయ, ద•ఢసంకల్పం మూర్తీభవించిన నరేంద్రమోదీపై దేశ ప్రజానీకం ఎలాంటి భీతి లేకుండా జాతినిర్మాణ భారాన్ని మోపారు. భారతదేశాన్ని పునరుజ్జీవన బాటలో నడిపి, ప్రపంచానికే ఒక వెలుగురేఖగా నిలబెడతారని అపారమైన విశ్వాసం పెట్టుకున్నారు. ఆ దిశగానే మోదీ అడుగులు పడుతున్నాయి. చిన్నగా దేశాభివ•ద్ధికి మార్గాలు సుగమం చేసుకుంటూ, అవరోధాలను అధిగమిస్తున్నారు.

Review జాతి ఆ’మో’దించిన నేత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top