మంచి మాటలు

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి

జన సమ్మోహన నేతకు ‘తెలుగు పత్రిక’ అక్షరాభిషేకం

మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు.. దాదాపు పది సంవత్సరాల పాటు ప్రజల మధ్యనే జీవితం.. ప్రజలతోడిదే లోకం.. ప్రజలతోనే మమేకం.. అందరి గుండె చప్పుడూ విన్నాడు.. ‘నేనున్నా’నంటూ భరోసానిచ్చాడు. జనమంతా ‘రావాలి జగన్‍.. కావాలి జగన్‍’ అంటూ ముక్తకంఠంతో నినదించారు. అది ఆంధ్ర దేశమంతటా ‘జగన్ని’నాదమై మారుమోగింది. నవ్యాంధ్ర నవ యువ నాయకుడికి బ్రహ్మరథం పట్టింది. కష్టాలనూ చిరునవ్వుతో స్వాగతించే నైజం.. తానెంచుకున్న బాటలో ఇబ్బందులెదురైనా మొక్కవోని ధైర్యం, దీక్షతో ముందుకు సాగే తత్వం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే సంకల్పం.. జన బలమే

భారత జాతి శంఖారావం. మోగింది ‘నమో’ మంత్రం.

గుక్క తిప్పుకోని వాగ్ధాటి.. మొక్కవోని దేశభక్తి.. ఇల్లు లేదు.. సంసారం లేదు.. కానీ, గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను భరతజాతికి పంచాలనే, జాతి సేవలో తరించాలనే సంకల్పం ఉంది. అఖండ భారతావనికి ఆయన చౌకీదార్‍ (కాపలాదారు). కానీ, ఆయన తనను తాను ఫకీరుగా అభివర్ణించుకుంటారు.. అశేష ప్రజానీకం గుండెల్లో ఆయన కొలువుదీరారు. అందుకే దేశం యావత్తూ ‘నమో’ అంటూ స్తుతించింది. భారత దేశానికి దశ, దిశ చూపే భావినేతను నీవేనని మరోసారి పట్టం కట్టింది. నరేంద్ర మోదీ..

నాన్నకు ప్రేమతో..

మాతృదేవోభవ.. అతిథి దేవోభవ.. ఆచార్య దేవోభవ.. పితృ దేవోభవ ఈ నాలుగు సూత్రాలు ఆర్ష ధర్మ సౌధానికి మూల స్తంభాలు. నిజానికి బిడ్డకు తొలి గురువు తండ్రే. బిడ్డకు అమ్మ పరిచయం చేసే మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం. బిడ్డ పుట్టుకకు హేతువై, విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్నంటే. తన కంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన

గంట కొట్టేదెవరు?

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

Top