మాతృత్వం ఓ తీయని కల

మూఢనమ్మకాలు మనిషి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను పామరులు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు.

చాలు చాలు.. నీ వలపు పంపిణీ

‘‘మీరు బ్రహ్మచారి కదా! శృంగార గీతాలు, రొమాంటిక్‍ పాటలు ఇంత బాగా ఎలా రాస్తున్నారు?’’ అని ఒకసారి రేలంగి.. మాటల మాంత్రికుడు పింగళి గారిని అడిగారట. ‘‘యుద్ధం సీన్లు చేయాలంటే యుద్ధం చేయాలా? రవి కాంచనిది కూడా కవి గాంచును కదా! అదే నీకు, నాకు ఉన్న వ్యత్యాసం’’ అని నవ్వుతూ బదులిచ్చారట పింగళి గారు. పాత తరం సినిమాల్లో పింగళి గారు రాసిన మాటలు, పాటలు మరుపురానివి. అప్పట్లోనే

మాటల్లో తెలుగు పాలెంత?

మనం నిత్యం ఎన్నో మాటలు మాట్లాడు తుంటాం. ఆ మాటల్లో ఎన్నో పదాలు పలుకు తుంటాం. వాటిలో చాలా వరకు పదాలు ‘తెలు గు’వే అనుకుంటాం. నిజానికి ఒకసారి అటువంటి పదాలను తరచి చూస్తే.. మనం మాట్లాడే భాషలో తెలుగు పాలెంతో తెలిసి వస్తే ఆశ్చర్యం కలగక మానదు. అసలు మనం మన తెలుగును మనం గౌరవించుకుంటూ ‘మాతృభాష’ అని సంబోధిస్తుంటాం. కానీ, ‘భాష’ అనే పదం సంస్క•తం. అంతెందుకు? ‘దేవుడు’.

చర్మానికి వరం చందనం

చర్మానికి నిగారింపు రావాలన్నా లేదా ముఖాన్ని మచ్చలు, గీతలు, మొటిమల నుంచి విముక్తి చేయాలన్నా చందనానికి సాటి మరోటి లేదు. కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం అమూల్యమైనది. చందనం లేదా గంధం ఒక విలువైన చెక్క. భారతదేశంలో దాన్ని అధికంగా వాడు తుంటారు. ఇది చాలా ఖరీదుగా ఉండటానికి కారణం ఈ చెట్లు నిదానంగా పెరగటమే. ఒక చెట్టు పూర్తిస్థాయిలో ఎదిగేందుకు సంవత్సరాలు పడుతుంది.

అమెరికా లో తెలుగు వెలుగు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ

ఇండియాలో డాక్టర్‍ కోర్సు పూర్తయితే.. వెంటనే ఏదైనా పట్టణానికో, నగరానికో వెళ్లిపోయి క్లినిక్‍ను ప్రారంభిస్తారు. నగర ప్రాంతాల్లో అయితే వైద్యానికి బాగా గిట్టుబాటు అవుతుందనేది చాలామంది అభిప్రాయం కావచ్చు. కానీ, ఆయన పక్కా పల్లెటూరు మనిషి. గ్రామాల గుండెచప్పుడు విన్న.. గ్రామీణుల మనసెరిగిన వైద్యుడు. ఆంధప్రదేశ్‍లో చదువుకుని అమెరికాలో అడుగుపెట్టినా.. ఆయన తన మూలాలను మరిచిపోలేదు. అందుకే అమెరికాలో కూడా ఆయన ఇరవై సంవత్సరాలుగా జార్జియా డగ్లస్‍ ఏరియాలోనే ప్రాక్టీస్‍

Top