।। రుద్ర నామం భజే ।।

శివరాత్రి మహాత్మ్యాన్ని వర్ణించే కథలు- లింగ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. లింగ పురాణంలో వర్ణించిన ప్రకారం- ఒకనాడు కైలాస శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశీనులై ఉన్నారు. పార్వతి- ‘దేవ దేవేశా! అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైన వ్రతం, భుక్తి, ముక్తి ప్రదాయకమైన దానిని గురించి తెలిపి నన్ను కృతార్థురాలిని చేయండి’ అని కోరింది. దీంతో శివుడు- దేవీ! శివరాత్రి వ్రతం ఒకటుంది. అది పరమ రహస్యం. సర్వయజ్ఞ

నేనే శివుడిని

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీవు ఎవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి- ‘చిదానంద రూప: శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అనే పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని. నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా

లాలిపరమానంద రామగోవింద

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక జో అచ్యుతానంద జో అచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామగోవింద నందు నింటను జేరి నయముమీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి కావరంబున నున్న కంసుని బడగొట్టి నీవు మధురాపురము నేలజేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి జో అచ్యుతానంద జోజో

సంకల్ప బలం

•ట్టిభము అనేది ఒక చిన్న ఆకారం కలిగిన పక్షి. దానినే లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఆ టిట్టిభ జాతికి చెందిన ఒక ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్లింది. అది తిరిగి వచ్చి చూసే సరికి గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను లోనికి ఈడ్చుకుని పోయాయి. గుడ్లు కనిపించకపోవడంతో ఆ టిట్టిభపక్షి మహా క్షోభ అనుభవించింది. పక్షులకు

ఏది నీ దారి?

పతీది మన ప్రారబ్ధం అనుకోవడం బలహీనుల లక్షణం. మన పుట్టుక,. దేహవర్ణం, తల్లిదండ్రులు, బంధువర్గం తదితర విషయాల్లో మనం స్వతంత్రులం కాకపోవచ్చు. భగవంతుడు ఎక్కడ పుట్టిస్తే, అక్కడి నుంచే మన జీవితాన్ని ఆరంభించాలి. కానీ స్వప్రయత్నంతో మనం ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. మన చరిత్రను మనమే తిరిగి రాసుకోవచ్చు. మన జన్మ ప్రారబ్ధ కర్మ కావచ్చు. కానీ, భవిష్యత్తు మాత్రం మన పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసే

Top