వెన్ను నొప్పితో బాధ పడుతున్నారా?

చాలామంది తరచుగా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. మన దగ్గర ప్రతి పదిమందిలో ఎనిమిది మంది వెన్నునొప్పి సమస్యతో సతమతమవుతుంటారు. సర్వసాధారణంగా నడుమునొప్పి, వెన్నునొప్పి గురించి ఎక్కువమంది చెబుతుంటారు. వెన్నునొప్పి రావడం, తగ్గడం వంటి ఈ సమస్యల నుంచి విముక్తికోసం అల్లాడిపోతుంటారు.

కండరాలు, కీళ్ళు, ఎముకలు మొదలైన వాటితో వచ్చే సమస్యల వల్ల కలిగే నొప్పి ఎక్కువమందిలో కనిపించే రకం నడుంనొప్పి. కండరాలను సంకోచింపజేయడం ద్వారా మానసిక ఒత్తిడి వెన్నునొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది. దాదాపు తొంభైశాతం కేసుల్లో ఆపరేషన్‍ లేకుండా వెన్నునొప్పిని నయం చేయొచ్చు. సమస్యపై రోగిలో అవ గాహన కలగజేయడం ముఖ్యం.

ఈ రోజుల్లో చాలామందికి వెన్ను లేదా నడుం భాగంలో నొప్పి రావడం మామూలైంది. ఇది ఎంత అరుదుగా వచ్చినా ఇలా వచ్చి అలా పోతూ అంత ప్రమాదకరంగా అనిపించక పోయినా దానిని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెన్నునొప్పి తరచుగా వస్తూ ఎక్కువ సేపు ఉంటూ ఉంటే దానిని తీవ్రంగా పరిగణించి వెంటనే తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనేక సందర్భాల్లో వెన్నునొప్పి అనేక సమస్యలకు దారి తీస్తుంది. కొందరు పదే పదే వెన్నునొప్పి గురించి చెబుతుంటారు. కానీ ఎందుకలా వస్తుందో తెలుసుకోవడం అవసరం.

ఎందుకు వస్తుంది?

నడుం కండరాలకు తగిలిన గాయం లేదా నడుం భాగంలో బెణుకు, ఒత్తిడ వల్ల, స్థూల కాయం వల్ల నడుం కండరాలపై నిరంతరం పడే భారంవల్ల, గర్భం, వెన్నుపూసలకు గాయం లేదా వ్యాధి రావడం వల్ల యాంకిలో జింగ స్పాండివైటిస్‍ కీళ్ళవాతం, డిస్క్ (వెన్ను పూస) జారడం వంటి పరిస్థితులు ఏర్పడం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. అలాగే వెన్నెముకకు సంబంధించిన నాడులు దెబ్బతినడం వల్ల కొన్ని సందర్భాలలో శరీరంలోని ఇతర భాగాలలో కలిగే వ్యాధుల లక్షణంగా కూడా వెన్నునొప్పి వచ్చే అవకాశం వుంది. వెన్నునొప్పి ఒక రోగలక్షణ మైన దానికి తరచుగా ఇతర లక్షణాలు తోడవుతాయి. ఉదాహరణకు మెడ, భుజాల, వెన్నెముక ప్రదేశం. కాళ్ళు, నడుం తదితర చోట్ల పట్టేసినట్లు వుండ వచ్చు. తిమ్మిరెక్కడం వంటి లక్షణాలు కనిపించ వచ్చు.

అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చో వడం వల్ల పెరిగేపోయే వెన్నునొప్పి సరిగా కూర్చోవడం వల్లగానీ, కుర్చీలో లోపం వల్లగానీ వచ్చే అవకాశం వుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు కండరాలు బిగుసుకొని పోయేటట్లు చేసి వెన్నుభాగంలో నొప్పులకు కారణమవుతాయి. వెన్నునొప్పికి ఎక్కువ కనిపించే కారణాలలో ఇది కూడా ఒకటిగా పేర్కొనవచ్చు.

కదిలినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు ఉధృతమయ్యే సాధారణ వెన్నునొప్పి వెన్నె ముకలో కీళ్ళదాతాన్ని సూచిస్తుంది. పక్కకు తిరిగి నప్పుడు, వంగినప్పుడు లేక ఏదైనా వస్తువును ఎత్తినప్పుడు, మరేదైనా చిన్నపాటి కదలిక తరువాత వెంటనే వెన్ను దిగువభాగంలో నొప్పి మొదలైందా? అది స్లిప్డ్ ప్రొలాప్స్డ్‍ ఒక కారణం కావచ్చు.

స్త్రీలకు వెనుక దిగువ భాగంలో నొప్పితో పాటు (డిశ్చార్జి, రక్త స్రావం) వంటి లక్షణాలు కనిపిస్తే అవి స్త్రీ జననాంగాలకు సంబంధిత వ్యాధులు కావచ్చు. తుంటి భాగంలో ఎక్కువ నొప్పి ఉండి కాలు ముందు భాగానికి కూడా వ్యాపించి నడిచేటప్పుడు అధికమయ్యే నొప్పికి ఆస్టియో ఆర్థరైటిస్‍ హిప్‍ కారణం కావచ్చు. ఒక పిరుదులో నొప్పి ఒక్కొకప్పుడు తొడ వెనుక భాగంలో కూడా సాక్రో ఇలియాక్‍ కీలుపై ఫలితం కావచ్చు. అందువల్ల వెన్నునొప్పి కలిగిన వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో వైద్య సహాయం పొందడం తప్పనిసరి.

పరీక్ష, చికిత్స తప్పనిసరి

నిపుణుడైన డాక్టర్‍ వద్దకు వెళ్ళి వెన్నునొప్పిని గురించిన వివరాలు చెప్పాలి. రోగనిర్థారణ కోసం వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. ఎత్తు, బరువు, వీపు, నడుం భాగంలో కండరాలను, వెన్నెముక పరిశీలన ఈ పరీక్షలలో భాగంగా ఉంటాయి. అలాగే కండరాలు మృదువుగా లేక బలహీనంగా ఉన్నాయా. లేక బిగువుగా ఉన్నాయి? తిమ్మిరి, మొద్దుబారడం వంటి నాడీ సంబంధ రుగ్మతలు ఉన్నాయా? అనే విషయాలను పరీక్షించి చెబుతారు. ఒక వేళ ఏదైనా తీవ్ర లోపం
ఉన్నట్లు పరీక్షలో తేలితే మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. వాటిలో ఎక్స్రే, వెన్నెముక ఎం.ఆర్‍.ఐ స్కానింగ్‍, రక్తపరీక్షలు, కంప్యూ టరటోమోగ్రఫి (సిటి) లేదా సిటిమైలోగ్రఫి, నెర్వ్ కండక్షన్‍, ఎకక్ట్రోమయోగ్రపి (ఇ.ఎం.జి) ఎముకల స్కానింగ్‍ ఏదో ఒక పరీక్ష చేయవల్సి వుంటుంది. కారణాన్ని బట్టి నొప్పి వ్యవధి ఆధారపడి వుంటుంది. స్వల్పకాలిక వెన్నునొప్పి అయితే రెండువారాల్లో మామూలుగా పని చేసుకోవచ్చు. అయితే బరువులెత్తడం వంటి ఒత్తిడి కలిగించే పనులు చేయించకూడదు.

అంతగా ప్రమాదకరం కాని వెన్నునొప్పులకు విశ్రాంతి తీసుకుంటూ కొన్ని మందులు వాడితే సరిపోతుంది. నడుముకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆపరేషన్‍ అవసరమౌతుంది.

విష్‍లాష్‍ సిండ్రోమ్‍, తలను ముందుకో, వెనక్కో వేగంగా వంచినట్లయితే మెడలోని లిగ మెంట్లు తీవ్రతమైన ఒత్తిడికి గురౌతాయి. (ఎముకలను కలిపి వుంచే, సాగే గుణంలేని గట్టి నరం వంటి భాగాలను లిగమెంట్లు అంటారు) నొప్పి, మెడ పట్టేయడం ఈ పరిస్థితుల లక్షణాలు. గాయం తగిలిన అనేక గంటల తరువాత సాధారణంగా ఇవి మొదలవుతాయి. మెడ అటూ ఇటూ కదలిక పట్టేయడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, గందరగోళం, మత్తుగా ఉండటం, ఉజ్వలమైన కాంతిని భరించలేకపోవడం మెనింజైటిస్‍ లక్షణాలు (మెదడు, వెన్ను పాములపై పొర అయ్యిమెంబ్రీన్‍ వాపు ఈ వ్యాధికి కారణం) వెన్నెముకలలో ఏదైనా వెన్ను పూస స్థానచలనం స్క్రిప్ట్ లేదా ప్రొలాప్స్ డిస్క్ ఫలితంగా భుజం, చేతుల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది.

ఏమాత్రం భాగాలు కదిలినా నొప్పి ఇంకా పెరుగుతుంది. నడుం, భుజం నొప్పి శ్వాస పీల్చినప్పుడల్లా అది పెరగడం, దగ్గు, జ్వరం మొదలైన లక్షణాలు న్యూమోనియా, ప్లూరసీ వంటి ఛాతి వ్యాధుల వల్ల కలుగుతుంది. నడుం నొప్పి పట్టేసినట్లు ఉండడం, వేళ్ళు తిమ్మిరెక్కి నట్లు లేదా మొద్దుబారడం వెన్నెముక లోని ఎముకలకు ఆస్టియో లిర్ద్రెరైటిస్‍ వచ్చిందన టానికి సూచనగా పేర్కొనవచ్చు.

వివిధ వైద్యవిధానాలలో వెన్నునొప్పి నివా రణకు మందులున్నాయి. అలోపతిలోనే కాకుండా హోమియోపతిలో కూడా తగిన చికిత్స, నొప్పి నివారనణకు మందులున్నాయి. అయితే వీటిని హోమియో వైద్యుని సలహా మేరకు మాత్రమే వాడాలి. సొంతవైద్యం తగదు.

Review వెన్ను నొప్పితో బాధ పడుతున్నారా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top