అద్భుత ఫలాలు
శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒకరోజు పొరుగు దేశపు రాజు కొన్ని ఫలాలను బహుమతిగా పంపించాడు. వాటితో పాటు ఆ రాజు ఒక లేఖ కూడా రాశాడు. ‘మహారాజశ్రీ శ్రీకృష్ణ దేవరాయల వారికి భక్తితో రాయునది.. మా దేశంలో తప్ప ఇంకెక్కడా కాయని అపురూపమైన అద్భుత ఫలాలను మీకు బహూకరిస్తున్నాను. వీటిని తిన్న వారు దీర్ఘాయుష్కులవుతారు. వారికి వృద్ధాప్య మరణమే తప్ప అకాల మరణం ఉండదు’ అనేది ఆ లేఖ సారాంశం. శ్రీకృష్ణదేవరాయల ముఖం




