జ్ఞాని-భగవత్‍స్వరూపం

భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో సాధన చేయాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆయనను ఆరాధించాలి. భగవంతుడు లేదా సద్గురువు కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మనుషులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ఎంచి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు చేసే బోధనలు, ఉప దేశాలు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన

నవ్వు కొనాల్సిందేనా

ఈ జీవితం ఒక్కటే. దీన్ని ఫలవంతం చేసుకోవాలంటే జీవించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కష్టమైనా, నష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎదుటి వారిని, సాటి వారిని బేషరతుగా ప్రేమించాలి. సూర్యుడు, చంద్రుడు, పువ్వులు, పక్షులు, జంతువులు.. తమ తమ స్వభావాలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిసరాలను ఆనందమయంగా చేసుకుంటాయి. వాటితో పోలిస్తే విచక్షణ, వివేకం కలిగిన మనం ఈ జీవితాన్ని, ఎందుకు సంతోషకరం చేసుకోలేం. ఈ సృష్టిలో పైసా

షష్ఠిపూర్తిలోని పరమార్థం ఏమిటి?

తిలకాన్ని ఎందుకు ధరించాలి? మనదేహంలోని ప్రతి అవయవానికి ఒక్కో అధి దేవత ఉన్నారు. అలాగే నుదుటన బ్రహ్మదేవుడు అధి దేవత. నుదురు బ్రహ్మస్థానం. బ్రహ్మరంగు ఎరుపు. కనుక బ్రహ్మస్థానమైన నుదుటున ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి. నుదుటున సూర్యకిరణాలు సోకరాదు. మనలోని జీవి, జ్యోతి స్వరూపుడిగా భూమి మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో

ప్రగల్బాల రుక్మి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

గుర్రం మూతికి బట్ట కట్టినట్టే

చక్కెర కంటే తీయనైన మధుర గుళికలు మన తెలుగు పదాలు. అయితే.. ఇటీవల కాలంలో అంతగా చేదెక్కిపోతున్నాయెందుకు? చేజేతులా మనం చేటు తెచ్చుకుంటున్న నిర్లక్ష్యంతో తెలుగు పదాలకు పలుకుబడి తగ్గుతోంది. ఎన్నో అందమైన పదాలు.. ఆనందాన్ని కలిగించే భావాలు.. అవన్నీ కనుమరుగైపోతున్నాయెందుకు? తెలుగులో నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తులు, జాతీయాలు చదివితే ఎన్నో అర్థాలు తెలుస్తాయి. అవి ఆనందానికి వారధులవుతాయి. కనుమరుగైపోతున్న ఈ పదాల పలుకులన్నీ మన బడిలోనే చిన్ననాట చిన్నారులకు

Top