ఆరోగ్య ప్రదాత

ఏ దేశ సంప్రదాయం చూసినా సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. జీవశక్తినిచ్చే భగవానుడు. అత్యంత శక్తి సంపన్నుడు. ఆపన్నుల పాలిట కరుణారస హృదయుడు. సూర్యుడు ఈ సృష్టికి, వాతావరణానికి ఆద్యుడు. మన ఉనికికి మూలం. సూర్యుడు లేనిదే జీవరాశికి మనుగడ లేదు. అందుకు కృతజ్ఞతగా అనాదిగా సూర్యుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు మనిషి. ఆ ప్రార్థన ఒక వ్యాయామ విధానం. అందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. సూర్య నమస్కార విధానాలు నిజంగా

ఇష్టపడి చేద్దాం

మనం ఏం చేస్తున్నామన్నది కాదు.. ఎలా చేస్తున్నా మన్నదే ముఖ్యం. మనం పని విషయంలో నిత్య శ్రామికులం కావాలి. మనకు ఏది దొరికినా అది మన కర్మ.. అంటే మనం చేసిన పనుల ఫలితమే. అదే ప్రారబ్ధం. ఆ పని తాలూకు ఫలితం నిస్వార్థపూరితమైనదైతే దాని ఫలితం శాశ్వతంగా మిగిలిపోతుంది. అటువంటపుడు ఓటమి అనే భావమే దరి చేరదు. మనం చేసే పనులపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మనం వాడుకలో

ప్రదిక్షణలు ఎందుకు చేస్తారు?

దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదా ? భగవంతుడ్ని పూజించినవారు కోరుకొనే కోర్కె ఖచ్చితంగా ఎంతో బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనదీ, మానవసాధ్యం కానిదీ అయి ఉంటుంది. అటువంటి కోర్కె తీరిందంటే అది ఎంతో ఆనందించతగ్గ విషయం. ఆ కోరిక ధనం కావచ్చు, సుఖముకావచ్చు, పదవీకావచ్చు, చక్కని భర్తలేదా భార్యా ఏదైనా కావచ్చు. కోరుకున్న కోర్కెని బయటికి చెబితే విన్నవారు పైకినవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని

మనిషి స్వభావం

పేరుకే పిల్లల కథలు.. పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేర్లతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

వాక్యము దేవుడైయుండెను

బాషా వ్యక్తుల మధ్య వారధిలా నిలుస్తుంది. మెరుగైన జీవనాన్ని సారథై నడిపిస్తుంది. జీవన నాణ్యతకు మూలమైన ఆధ్యాత్మిక భావాలను మనసుల్లో నాటడానికి భాషను మించిన ఉపకరణం లేదు. అలా కోట్లాది మంది భక్తులకు చేరువైన ఆధ్యాత్మిక గ్రంథం బైబిల్‍. బైబిల్‍ పఠనం అనేది లక్షలాది మంది క్రైస్తవుల నిత్యకృత్యంగా మారటానికి తెలుగు భాషే కారణం. డిసెంబరు 25 క్రిస్మస్‍ పర్వదినం సందర్భంగా బైబిల్‍ తెలుగు లిపి గురించి, బైబిల్‍ ఘనత

Top