పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక గుంటనక్క- విశ్వప్రేమ నక్క బావ డొక్క కాలి ఎక్కడేమి దొరకక తిక్కపట్టినట్టు తిరిగి తిరిగి చివరకు గుడిసెపైన కూరుచున్న కోడిపుంజు వైపు చూసి ‘మంచి వార్త.. మంచి వార్త’ అంచు పిలిచెను గుంటనక్క గారి జోరు కంట జూచి కోడిపుంజు ‘ఏమిటేమి?’టంచు ప్రశ్న వేసి నంతనె ‘విననె లేదటోయి! నీవు ‘విశ్వప్రేమ’ అనెడి

అద్భుతహ: మార్గశీర్షోహ

2023- డిసెంబరు 1, శుక్రవారం, కార్తీక బహుళ చతుర్థి నుంచి 2023- డిసెంబరు 31, ఆదివారం, మార్గశిర శుద్ధ చతుర్థి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం-కార్తీకం- మార్గశిరం- హేమంత రుతువు-దక్షిణాయణం ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. డిసెంబరు 1, కార్తీక బహుళ చతుర్థి

ఉత్తరాయణం

కార్తీక దీపశోభ తెలుగు పత్రిక నవంబర్‍ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది. - పి.సంతోష్‍కుమార్‍, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్‍లైన్‍ పాఠకులు నీతి కథలు వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను

ఆదియందు వాక్యముండెను..

ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.. అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ

సమస్తం.. పుస్తకం

పుస్తకం అంటే ఆపాద మస్తకం మనల్ని స్ప•శించే ఓ నేస్తం. మంచి పుస్తకం మన మస్తిస్కాన్ని తెరుస్తుంది. భావాలను, ఆలోచనలను విశాలం చేస్తుంది. జీవన సరళిని మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే పుస్తకం అంటే కేవలం కాగితాల పుటలు కాదు.. పుస్తకం అంటే ఓ భావం.. ఓ బంధం.. ఓ భావోద్వేగం. మనిషిని మహోన్నతుడిని చేసేది పుస్తకమే. పుస్తకం మాట్లాడదు. కానీ, మనతో ఎన్నో భావాలను పలికిస్తుంది. ఆలోచనల్ని చిలకరిస్తుంది. ఊరడిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది. కథలు చెబుతుంది. కలలు కనేలా

Top