ఉత్తరాయణం

సమస్తం.. పుస్తకం తెలుగు పత్రిక డిసెంబరు 2024 సంచికలో పుస్తక మహోత్సవం శీర్షిక కింద పుస్తకాలు చదవాల్సిన అవసరం గురించి, జీవితంలో తప్పక చదవాల్సిన తెలుగు పుస్తకాలు, తెలుగు అనువాదాల గురించిన వివరాలు చాలా చాలా బాగున్నాయి. ప్రస్తుతం అందరిలోనూ చదివే అలవాటు తగ్గిపోతుంది. ఈ శీర్షికలో అక్షరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవచ్చో చక్కగా వివరించారు. అలాగే తప్పక చదవాల్సిన పుస్తకాల వివరాల జాబితా బాగుంది. ప్రతి ఒక్కరు భద్రంగా దాచుకోవాల్సిన

సరి ‘కొత్త’ క్రాంతి

ఒక రాజు తన రాజ్యంలో జ్ఞానులందరినీ పిలిచాడు. ‘విజయంలో, ఓటమిలో, ఆనందంలో, దు:ఖంలో.. ఎలాంటి సందర్భంలోనైనా ఓ మంత్రంలా పనిచేసే మాటల్ని మీలో ఎవరైనా సూచించగలరా? మీరెవరూ సలహా ఇవ్వడానికి నాకు అందుబాటులో లేనపుడు ఆ మాట నాకు సాయపడాలి’ అని అడిగాడు. రాజు ప్రశ్నలకు జ్ఞానులందరూ మొదట అయోమయంలో పడ్డారు. చివరకు ఆలోచించగా, ఆలోచించగా, వారిలో ఒకరు చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. ఆ మాటల్ని వారంతా కాగితంపై రాసి రాజుకు ఇచ్చారు.

‘కొత్త’ సందేశం

‘‘హ్యాపీ న్యూ ఇయర్‍’’ ఇలా కొత్త సంవత్సరం తొలిరోజును చెప్పించుకోవడమన్నా.. చెప్పడమన్నా అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆ పలకరింపులో, అలా చెప్పడంలో ఎంతో ఆనందం ఇమిడి ఉంది. మరెంతో సంతోషం దాగి ఉంది. న్యూ ఇయర్‍ సంతోషాలను మూటగట్టి ఇస్తుందన్న ఓ విశ్వాసమే ఇంతటి ఆనందానికి కారణం. అందుకే కొత్త సంవత్సరం నాడు కనిపించిన అందరికీ, ఎదురైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెబుతుంటాం. ఇది ఆంగ్లమానం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరమే

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక గుంటనక్క- విశ్వప్రేమ నక్క బావ డొక్క కాలి ఎక్కడేమి దొరకక తిక్కపట్టినట్టు తిరిగి తిరిగి చివరకు గుడిసెపైన కూరుచున్న కోడిపుంజు వైపు చూసి ‘మంచి వార్త.. మంచి వార్త’ అంచు పిలిచెను గుంటనక్క గారి జోరు కంట జూచి కోడిపుంజు ‘ఏమిటేమి?’టంచు ప్రశ్న వేసి నంతనె ‘విననె లేదటోయి! నీవు ‘విశ్వప్రేమ’ అనెడి

అద్భుతహ: మార్గశీర్షోహ

2023- డిసెంబరు 1, శుక్రవారం, కార్తీక బహుళ చతుర్థి నుంచి 2023- డిసెంబరు 31, ఆదివారం, మార్గశిర శుద్ధ చతుర్థి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం-కార్తీకం- మార్గశిరం- హేమంత రుతువు-దక్షిణాయణం ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. డిసెంబరు 1, కార్తీక బహుళ చతుర్థి

Top