పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పక్కా ఫకీరు ఒంటెల దోలుకు పోయే వారొక కుంట గట్టుపై జేరారు కుంటి యొంటె గనుపడలేదంటూ గ్రుద్దులాడుకోసాగారు ఆ సమయానికె ఫకీరు వాడొక డక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ యయ్యలు ‘మా యొంటె గప్పడిన దా?’ యని ఫకీరు నడిగారు ‘కుంటి కాలిదేనా?’ యని సాహే బంటే

సూర్యారాధన.. సరస్వతీ పూజ

సూర్యారాధన.. సరస్వతీ పూజ ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి మాసం సంవత్సరంలో రెండో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పుష్య - మాఘ మాసాల కలయిక. పుష్య మాసంలోని కొన్ని రోజులు, మాఘ మాసంలోని మరికొన్ని రోజుల ఈ నెలలో కలుస్తాయి. ఫిబ్రవరి 1, పుష్య బహుళ షష్ఠి నుంచి నుంచి ఫిబ్రవరి 9 పుష్య బహుళ చతుర్దశి వరకు పుష్య మాస తిథులు, ఆపై ఫిబ్రవరి 10

ఉత్తరాయణం

కొత్త సందేశం తెలుగు పత్రిక జనవరి 2024 సంచికలో కొత్త సంవత్సరం సందర్భంగా అందించిన ప్రత్యేక కథనం చాలా బాగుంది. ప్రతి భాషలోనూ, ప్రతి సంస్క•తిలోనూ పలకరింపు అనేది ఎంతో ముఖ్యమైనది. దానిని సరిగా ఉపయోగించడం నేర్చుకుంటే, అది మనల్ని మనిషిగా ఓ మెట్టు పైన ఉంచుతుందనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు. కొత్త సంవత్సరం వేళ కొత్త విషయాలను అందించినందుకు అభినందనలు. - బి.హరినాథ్‍, కె.భిక్షపతి, హరిప్రసాద్‍, టి.ఎస్‍.నవీన్‍, శ్రీకాంత్‍ మరికొందరు

బతుకును పండించుకుందాం!

మన నవీన ధర్మాల మూలాలన్నీ సనాతన ధర్మాలతో ముడిపడి ఉన్నాయి. మన సంప్రదాయంలో విద్యాభ్యాసం అనేది అత్యంత ముఖ్యమైనది. హృదయ వికాసం కలిగించేదీ, ద్వంద్వాలు, మానసిక వికారాలు తొలగించి వివేకాన్నిచ్చేది అసలైన విద్య. మొత్తం మనకున్న విద్యలన్నీ కలిపి పద్దెనిమిది రకాలని అంటారు. కానీ, స్థూలంగా చెప్పాలంటే విద్యలు రెండు రకాలు. ఒకటి- పరావిద్య, రెండు- అపరావిద్య. పరావిద్యనే ఆధ్యాత్మిక విద్య అని కూడా అంటారు. దీనివల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అపరావిద్య అంటే- లౌకిక విద్య. అంటే

పలుకు తేనెల తల్లి

సర:’ అంటే కాంతి. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. జనజీవితాలను జ్ఞాన, కాంతిమంతం చేసే మాతృశక్తి, అక్షరజ్ఞానాన్ని ఒసగే మంత్రశక్తి- శ్రీ సరస్వతీమాత. సాహిత్యం, సంగీతం అనే రెండు అమృత కలశాలను మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి అయిన సరస్వతీదేవి అక్షరానికి అధిదేవత. ప్రణవ స్వరూపిణి. జ్ఞానానంద శక్తి. లౌకిక, అలౌకిక విజ్ఞాన ప్రదాయిని. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ

Top