ఆధ్యాత్మిక ‘మార్గ’దర్శి

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో పదకొండో మాసం- నవంబరు. తెలుగు పంచాంగం ప్రకారం ఇది కార్తీక- మార్గశిర మాసాల కలయిక. ఈ మాసంలో నవంబరు 20, గురువారం వరకు కార్తీక మాస తిథులు కొనసాగుతాయి. ఆ తదుపరి నవంబరు 21, శుక్రవారం నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతాయి. కార్తీక, మార్గశిర మాసాల కలయిక అయిన ఈ నవంబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపూర్ణిమ - జ్వాలా

లేజీ టీన్స్.. డేంజర్‍ బెల్స్

పిల్లలంటే లేడిలా పరుగెత్తాలి. ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అది వారి వయసు సహజ స్వభావం. బడి నుంచి వచ్చాక మైదానంలోనో, ఇంటి ఆరుబయటో అలసిపోయేలా ఆడేవారు. ఆకలేసినపుడు ఇంటికెళ్లి అన్నం తినేవారు. హోంవర్క్, ఇతరత్రా పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించే ముందు పెద్దోళ్ల చేత కథలు చెప్పించుకుని కమ్మని నిద్రలోకి జారుకునే వారు. ఇదంతా గతకాలపు పిల్లల జీవితం. మరి ఈ కాలం పిల్లలు అలా ఉన్నారా?. బడి నుంచి ఇంటికి

ఆడుతూపాడుతూ.. చదవాలి..గెలవాలి!

నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ఈ మాసపు ప్రత్యేక కథనమిది.. ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు.. నడుం వంగిపోయే బరువుతో బ్యాగులు మోస్తూ ఏ విద్యార్థీ కనిపించడు. యూనిఫాం, హోంవర్కులూ, వార్షిక పరీక్షలూ మార్కులూ, ర్యాంకుల పోటీ, రోజంతా సాగే స్కూలు.. స్టడీ అవర్లూ, ట్యూషన్లూ.. ఇవేవీ అక్కడ కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులను కష్టపెట్టే ఏ చిన్న విధానమూ అక్కడ అమలు చేయరు.

అన్నం తిందాం రండి.. అరిటాకు వెయ్యండి

అరిటాకులో భోజనం.. చివరిసారిగా ఎప్పుడు చేశారో గుర్తుచేసుకోండి!. గుర్తులేదు కదూ! అవును. అరిటాకులో అన్నం తినడం మనమెప్పుడో మరిచిపోయాం. మరి, కార్తీక మాసం వస్తోంది. కనీసం ఈ సందర్భాన్ని పురస్కరించుకునైనా అరిటాకులో తిందాం!. కార్తీకం.. ఆధ్యాత్మిక మాసం. ఉదయాన్నే చన్నీటి స్నానాలు.. ఉపవాసాలు.. దీపారాధనలు.. దానాలూ వ్రతాలూ.. ఇవన్నీ ఒకెత్తయితే ఇంటిల్లిపాదీ, బంధుమిత్ర జనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా విందారగించే సందర్భమూ కార్తీకంలోనే వస్తుంది. అవే- వన భోజనాలు. కార్తీక మాసం

ముద్దుగుమ్మల మనసులో మాట

వెండితెరపై అందాలను ఆరబోసే మన కథానాయికలు ఆఫ్‍ స్క్రీన్‍లో భలే ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటారు. ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? జీవితం గురించి దృక్పథం ఏమిటి? అనే విషయాలపై ముద్దుగుమ్మలు చెబుతున్న విషయాలేమిటో చదివేయండి మరి.. ‘పర్వ’ చదువుతున్నా: అనుష్క నేను బయటికి రావడానికి, తరచూ కనిపించడానికి పెద్దగా ఇష్టపడను. ప్రస్తుతం రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యా. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అదో

Top