లక్ష్మీ దీవెన..గణపతి పాలన

2025- ఆగస్టు 1, శుక్రవారం, శ్రావణ శుద్ధ అష్టమి నుంచి 2025- ఆగస్టు 31, ఆదివారం, భాద్రపద శుద్ధ అష్టమి వరకు.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం -శ్రావణం/భాద్రపదం - వర్ష రుతువు- దక్షిణాయణం ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో ఎనిమిదో మాసం- ఆగస్టు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం.. భాద్రపద మాసంలో కొన్ని రోజులు కూడా కలుస్తున్నాయి. శ్రావణ, భాద్రపద తిథులతో కూడిన ఆగస్టు నెల పొడవునా పండుగలు, పర్వాలే. శ్రావణ,

స్వాగతం కృష్ణా..

కృష్ణ.. ఈ రెండు అక్షరాలకు అష్టాక్షరీ మంత్రంతో సమానమైన మహత్తు ఉంది. కృష్ణ అనే మాటకు ఐదు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి- నల్లని వాడు. రెండు- ఆకర్షణ శక్తి ఉన్నవాడు. మూడు- సచ్చిదానంద స్వరూపుడు. నాలుగు- చెడును నిర్మూలించే వాడు. ఐదు- కాల స్వరూపుడు. కృష్ణ అనే పేరుకు ఉన్న అర్థాల మాదిరిగానే కృష్ణుడి జీవితంలోనూ పలు పార్శ్వాలున్నాయి. బాలకృష్ణుడు, భాగవత కృష్ణుడు, భారత కృష్ణుడు.. ఇలా ఆయన ఒకే జీవితంలో పెక్కు పాత్రలు పోషించాడు. కృష్ణుడి వివిధ స్వరూపాల్లో బాలకృష్ణుడి

వరలక్ష్మీ వ్రత విధి

శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలనేది శాస్త్ర నియమం. ఒకవేళ ఆరోజు వీలు కాకుంటే తరువాత వచ్చే శుక్రవారాల్లోనైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మన భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో అత్యంత ప్రాధాన్యమైనదీ వ్రతం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి విశిష్ట దేవత. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమైనదని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన, ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పక్కా ఫకీరు ఒంటెల దోలుకుపోయే వా రొక కుంట గట్టుపై జేరారు కుంటి ఒంటె గనుపడుటలేదంటూ గుద్దులాడుకోసాగారు ఆ సమయానికె ఫకీరువా డొక డటకె వచ్చి కూర్చున్నాడు ఆ అయ్యలు ‘మా ఒంటె గన్పడిన దా?’ యని ఫకీరు నడిగారు ‘కుంటి కాలిదేనా?’ యని సాహే బంటే,

చైత్ర వైశాఖల వసంత వికాసాలు

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర - వైశాఖ మాసాల కలయిక. తెలుగు సంవత్సరాలలో చైత్రం మొదటిది. చైత్ర మాసం గడిచిన మార్చి 30న ప్రారంభమైంది. ఆనాడే ఉగాది. ఇక, ఏప్రిల్‍ మాసం విషయానికి వస్తే ఏప్రిల్‍ 1, చైత్ర శుద్ధ చవితి, మంగళవారం నుంచి ఏప్రిల్‍ 30, బుధవారం, వైశాఖ శుద్ధ తదియ వరకు చైత్ర, వైశాఖ మాసాల తిథులు

Top