సంపాదకీయం ‘మాఘ’ సందేశం!
మహా శివరాత్రి నాటికి చలి.. ‘శివ.. శివా’ అంటూ వెళ్లిపోతుందట. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్య కిరణాల తీక్షణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడిని సంతరించుకుంటాయి. అంటే, శివరాత్రి నాటికి చలి-వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్న మాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా అనుకూలించాలి. అటువంటి సమ శీతోష్ణస్థితి ఉండేది మహా శివరాత్రి




