ఉత్తరాయణం

శివ వైభవం శివుడి గురించి ఇప్పటి వరకు అవీ ఇవీ విన్నవే కానీ.. ఆయనకు దశావతారాలు ఉన్నాయని, ఆయన నర్తించిన క్షేత్రాలు ఐదు ఉన్నాయని ఇదే తెలుసుకోవడం. తెలుగు పత్రిక 2025, ఫిబ్రవరి సంచికలో మహా శివరాత్రి సందర్భంగా శివ వైభవాన్ని భలే వివరించారు. అలాగే శ్రీశైలం క్షేత్రం గురించి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలిగాం. - సీహెచ్‍.శ్రీకాంత్‍, వెంకటేశ్వరరావు, రచన, కమలేశ్‍, డి.వీ.కృష్ణ, రవివర్మ, కే.ఆర్‍.సత్యప్రసాద్‍, కె.రఘురామ్‍, మరికొందరు

వసంత వికాసం మనసంతా సంతోషం

యుగ యుగాల యుగాది.. మదిలో మొలిచే కొత్త ఆశలకు పునాది.. మంచిని పెంచే ఆలోచనలకు శుభాది.. మానవ జీవన వసంత గీతిక ఉగాది.. ఉగాది అంటే ప్రకృతి పాడే వసంత గీతం. శీతగాలులతో ఇక్కలాక్కునిపోయి.. జీవనసారం ఇగిరిపోయి.. పచ్చనాకులు ఎండుటాకులుగా మారి రాలిపోయి.. చెట్టు బోసిపోయినపుడు ఆ కొమ్మ సందుల్లోంచి లేలేత చివుళ్లు చిందులేస్తూ కనిపించాయా? అదే వసంతాగమన సూచిక. అదే ప్రకృతి పరవశం. ఉగాది సంరంభానికి అదే స్వాగత సన్నాహం. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా.. ప్రతిఘటించి ముందుకు సాగాలన్నదే ప్రకృతి మనకు

ఆత్మ‘విశ్వా(వ)స’ నామ సంవత్సరం

రుతువుల్లో మొదటిది- వసంతం. మాసాల్లో మొదటిది- చైత్రం. పక్షాల్లో మొదటిది- శుక్ల పక్షం. తిథుల్లో మొదటిది- పాడ్యమి. మొదలు అంటే ఆది. ఇన్ని ఆదులు కలిసే రోజు ఉగాది. కాలగతిలో కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి.. కొన్ని నడకలు అలసిపోతాయి.. కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకుంటాయి.. ఇవన్నీ అందరి జీవితంలో ఉండేవే.. అలాంటి వాటన్నింటినీ మళ్లీ కదిలించాలి. ఆగిపోయిన ఆలోచనలు, తీరని కలలు, నెరవేరని సంకల్పాలను మళ్లీ అరంభించడానికి అసలు సిసలు తరుణమిదే. కలల బూజును దులిపేయాలి. బద్ధకాన్ని గోడుకున్న కొక్కేనికి తగిలించాలి. నిర్లక్ష్యాన్ని వీడాలి. గమ్యం చేరని లక్ష్యాలపై మళ్లీ గురిపెట్టాలి. నీరసపడిపోయిన

వీరోచిత పాత్రల్లో ‘హీరో’యిన్లు!

హీరోయిన్‍ అంటే.. హీరో ఫైట్లు చేసి చేసీ.. అలసిపోయిన ఓ డ్యూయట్‍ పాడుకుంటే ఆ హీరో పక్కన మెరిసే అందాలబొమ్మ. అంతేనా? దాదాపు సినిమాలన్నీ ఇదే లైన్‍లో ఉంటుంటాయి. అందచందాలతో ఆకట్టుకోవడమే కథానాయికల పనన్నట్టుగా సినిమాలుంటాయి. అయితే, కొందరు హీరోయిన్లు మాత్రం డిఫరెంట్‍. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి కథానాయక ప్రాధాన్యమున్న సినిమాల కథా.. కమామిషు.. అనుష్క ‘ఘాటి’కురాలు: బాహుబలిలో ఎంత శక్తివంతమైన పాత్రలో కనిపించిందో

ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు..

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‍లో చందూ మొండేటి దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ‘తండేల్‍’ నుంచి ఇటీవలే ఓ శివశక్తి గీతం విడుదలైంది. ‘నమో నమ:శివాయ.. ఢమ ఢమ ఢం అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు.. అష్టదిక్కులు అదిరేట్టు తాండవేశ్వరా..’ అంటూ సాగే ఈ గీతం అభిమానులను అలరిస్తోంది. జొన్నవిత్తుల సాహిత్యానికి దేవీశ్రీప్రసాద్‍ స్వరాలు సమకూర్చగా అనురాగ్‍ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. శేఖర్‍ మాస్టర్‍ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటను విజువల్‍గా తెరకెక్కించిన తీరు, ఇందులో

Top