ఈ శివుడు.. రోగనాశకుడు

సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఇక్కడి శివుడిని రోగనాశకుడిగానూ కొలుస్తారు. అక్కడి వేడినీళ్ల కుంటలో స్నానం చేస్తే శరీరం ఆరోగ్యవంతం అవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రలో గల ఉన్కేశ్వర్‍ ఆలయం. శ్రీరాముడు వనవాస కాలంలో ఉన్కేశ్వర్‍ ప్రాంతంలో సీతా సమేతంగా నివాసం ఉన్నాడట. ఆ సమయంలోనే భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట.

వీణాపాణి.. విమల సరస్వతి

వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. అదే శ్రీపంచమిగా ప్రసిద్ధి. అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ దేవికి అసలైన సమర్పణ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించి చందనం, క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదించాలని శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పినట్టు దేవీ భాగవతంలో ఉంది. విద్యార్థులు సరస్వతిని

మరదలు మర్యాద

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక అక్కతోడా నీవు బండెక్కి వస్తే ఆనందమౌతుంది అందరికి బావ! మొలక నవ్వుల నిన్ను పలకరిస్తాను అమ్మ నాన్నా నిన్ను ఆదరిస్తారు చుట్టపక్కాలు నిను చూడవస్తారు మేలైప వాడవని మెచ్చుకుంటారు అక్కను నీ వెంట కొనిరాక బావ బిక్కుబిక్కుమంటు ఒక్కడవు వస్తే చిత్తమొల్లాదోయి క్షేమంబు లడుగ మనసు

సూర్యారాధన..శివార్చన

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో రెండో మాసం- ఫిబ్రవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ మాసం. కేవలం ఒక్కరోజు మాత్రమే ఫాల్గుణ మాస తిథి కలుస్తుంది. ఫిబ్రవరి 1, శనివారం, మాఘ శుద్ధ తదియ నుంచి ఫిబ్రవరి 27, గురువారం, మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఆపై ఫిబ్రవరి 28, శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి ఫాల్గుణ మాస ఆరంభ దినం. మాఘ మాసంలో

ఉత్తరాయణం

పండగ సందర్భం ‘పండగంటే పిండివంటలు చేసుకుని, కొత్తబట్టలు వేసుకునే సంబరం కాదు.. నిన్నూ నన్నూ ఏకం చేసే ఒక సందర్భం..’ అంటూ తెలుగు పత్రిక 2025, జనవరి సంచికలో సంక్రాంతిని పురస్కరించుకుని అందించిన ముఖచిత్ర కథనం భలే ఉంది. పండగలు నేడు పరమ రొటీన్‍గా మారిపోయాయి. వాటిని అందంగా, ఆనందంగా ఎలా మలుచుకోవాలో చక్కగా వివరించారు. - సి.కృష్ణకాంత్‍రెడ్డి, పి.విశ్వనాథరావు, టి.ఎస్‍.రవి, కడెం రామచంద్ర, పి.భార్గవి, ఎల్‍.ఆర్‍.రుషి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు పిల్లల పాటలు మనం

Top