జయ జయ శంకర

ఆయన విద్వద్వరేణ్యుడు, మహాపండితుడు, గొప్ప తత్వవేత్త, సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన మహాయోగి, గొప్ప మత సంస్కర్త, సంఘసంస్కర్త అన్నిటికీ మించి మహాజ్ఞాని.... ఆయనే సాక్షాత్తూ శంకరుని అంశతో జన్మించిన శంకరాచార్యులు. ఆది శంక రులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. పూవు పుట్టగానే పరిమళిస్తుందన డానికి అసలైన ఉదాహరణ ఆయన జీవితం. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో

రామ ధర్మం… మా’నవ’ ధర్మం

ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే, రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మునుముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శ్రీరామునిలా ఉండాలని, తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడేమో! రాముడిని దేవుడిలా కాదు.. మానవుడిలా చూస్తే.. ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో తెలిసి వస్తుంది.

హోలీ… చెమ్మ కేళి

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను మహా ఫాల్గునీ అనీ అంటారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలప్రదమై ఉంటుందని గదాధర పద్ధతి అనే గ్రంథంలో వివరించారు. ఇక, ఈనాడు భారతీయంలో ప్రఖ్యాతమైన హోలీ పర్వదినం కూడాను. హోలికా, హోళికా దాహో అనే పేర్లతో స్మ•తి కౌస్తుభం, హుతాశనీ పూర్ణిమ, వహ్న్యుత్సవం అనే పేర్లతో ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలోనూ వర్ణించారు. ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమ

అమెరికా లో తెలుగు వెలుగు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ

ఇండియాలో డాక్టర్‍ కోర్సు పూర్తయితే.. వెంటనే ఏదైనా పట్టణానికో, నగరానికో వెళ్లిపోయి క్లినిక్‍ను ప్రారంభిస్తారు. నగర ప్రాంతాల్లో అయితే వైద్యానికి బాగా గిట్టుబాటు అవుతుందనేది చాలామంది అభిప్రాయం కావచ్చు. కానీ, ఆయన పక్కా పల్లెటూరు మనిషి. గ్రామాల గుండెచప్పుడు విన్న.. గ్రామీణుల మనసెరిగిన వైద్యుడు. ఆంధప్రదేశ్‍లో చదువుకుని అమెరికాలో అడుగుపెట్టినా.. ఆయన తన మూలాలను మరిచిపోలేదు. అందుకే అమెరికాలో కూడా ఆయన ఇరవై సంవత్సరాలుగా జార్జియా డగ్లస్‍ ఏరియాలోనే ప్రాక్టీస్‍

నాలో నేను… నీలో నువ్వు..

ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇప్పటికిప్పుడు ఉన్నవన్నీ త్యజించేసి.. అడవులకో, పర్వత శిఖరాల మీదకో వెళ్లి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమా? మనకున్నవన్నీ వదిలేసుకుని కట్టుబట్టలతో సంచరించడమా? ఆధ్యాత్మికత అంటే ఒక మతానికో, ఒక దేవుడికో సంబంధించినది కాదు. అదొక మానసిక చింతన. నీలోకి నువ్వు చూసుకోవడం. నీలోని నిన్ను తెలుసుకోవడం. నిన్ను నువ్వు గుర్తించడం. అదొక దైవ చింతన. దీని కోసం సంసారాలను వదిలి పెట్టాల్సిన పని లేదు. ఆస్తిపాస్తుల్ని త్యజించాల్సిన అవసరం లేదు. కాస్తంత వైరాగ్య భావం ఉంటే

Top