నేడే నా సీమోల్లంఘనం
షిర్డీ సాయిబాబా దేహత్యాగం చేసి ఈ దసరా నాటికి నూట మూడు సంవత్సరాలు. విజయదశమి (దసరా) నాడే బాబా దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. షిర్డీలో ఈ సందర్భాన్ని పురస్కరించిన విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు.




