వరలక్ష్మీ వ్రత విధి
శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలనేది శాస్త్ర నియమం. ఒకవేళ ఆరోజు వీలు కాకుంటే తరువాత వచ్చే శుక్రవారాల్లోనైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మన భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో అత్యంత ప్రాధాన్యమైనదీ వ్రతం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి విశిష్ట దేవత. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమైనదని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన, ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట




