కవర్‍ స్టోరీ

దేవదేవుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి వేంచేశాడు. వస్తూ వస్తూ వైకుంఠంలో ఉండే కొండలనూ, కోనలనూ, తీర్థాలనూ వెంట తెచ్చుకున్నాడు. తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో పాటు సేవకులైన గరుత్మంతుడు ఇతర పరివారమంతా ఆయన వెంటే ఉన్నారు. ఆ దేవదేవుడు నేరుగా సప్తగిరులలో అడుగిడాడు. అదిగో! అదే శ్రీహరివాసమైంది. ఆ స్వామి ఈ భూలోకంలో ఏరికోరి.. అదీ తెలుగింటి నేలపై ఇల్లు (ఆలయం) గుడి కట్టుకుని.. తెలుగువారి ఇంటింటి ఇలవేల్పుగా

కన్నీరు – చిరునవ్వు

కన్నీరు.. మనసును కలత పెడుతుంది. చిరునవ్వు.. మనిషిని సంతోషభరితం చేస్తుంది. ఈ రెండూ పరస్పర ఆధారితాలు. ఒకదానితో మరొకటి సంబంధం గలవి. ఈ రెండింటి మధ్యా ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి అనాదిగా, అవిశ్రాంతంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. అలాగే, ఏళ్లుగా ఈ కన్నీళ్లు, చిరునవ్వుల గురించిన ప్రశ్నలు మానవ మస్తిష్కాలను తొలుస్తూనే ఉన్నాయి. ఏమిటీ కన్నీరు? అదొక శాపం. భగవంతుడి పరోక్షానికి సాక్ష్యం. ఏమిటీ చిరునవ్వు? ఇదొక వరం. భగవంతుడి ప్రత్యక్షానికి సాక్ష్యం. ఈ ప్రశ్నలూ, సమాధానాలు రెండూ మనల్ని తికమక పెడుతుంటాయి.

ఆడుతూపాడుతూ.. చదవాలి..గెలవాలి!

నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ఈ మాసపు ప్రత్యేక కథనమిది.. ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు.. నడుం వంగిపోయే బరువుతో బ్యాగులు మోస్తూ ఏ విద్యార్థీ కనిపించడు. యూనిఫాం, హోంవర్కులూ, వార్షిక పరీక్షలూ మార్కులూ, ర్యాంకుల పోటీ, రోజంతా సాగే స్కూలు.. స్టడీ అవర్లూ, ట్యూషన్లూ.. ఇవేవీ అక్కడ కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులను కష్టపెట్టే ఏ చిన్న విధానమూ అక్కడ అమలు చేయరు.

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వమ్‍ దీపలక్ష్మీ నమోస్తుతే బ్రహ్మ సకల జ్ఞానానికీ అధిపతి. దీపం సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరించివేస్తుంది. ఎలాంటి కార్యాన్నయినా సాధించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి దీపలక్ష్మీ నీకు నమస్కారం!. దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. నిత్య పూజా విధిలో అది ప్రధాన భాగమై విరాజిల్లుతోంది. దీపారాధన చేయనిదే ఎలాంటి శుభకార్యాలూ ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతి

దిలీప్‍ టుంకి… టూ లీడర్‍

నాయకుడు- అందరిలా సాధారణంగానే పుడతాడు. కానీ, అతడి అసాధారణ ఆలోచనలు, చర్యలే.. అతడిని నాయకత్వం వహించే వాడిగా తీర్చిదిద్దుతాయి. మార్పు- రాత్రికి రాత్రే రాదు. కానీ, మొగ్గ తొడిగి, మారాకు వేసి ఆకుగా రూపాంతరం చెందినట్టు ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణంలో మార్పు మొదలవుతుంది. ఆ ఆరంభమే కొత్త మార్పునకు నాంది పలుకుతుంది. గొప్ప నాయకత్వ పటిమ ఉన్న వారే గొప్ప మార్పునకు పునాది వేయగలుగుతారు. నాయకుడంటే ముందుండి నడిపించే వాడు కాదు..

Top