జంటలను కలిపే కళ్యాణ క్షేత్రం
శ్రీనివాసుని సమక్షంలో పెళ్లి చేసుకుంటే జీవితంలో అర్థం, పరమార్థం సిద్ధిస్తుందని ఆశించే వారెందరో! అటువంటి భక్తుల ఆశలకు వేదిక.. చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా)లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్కు కేవలం 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం తిరుపతి, చిలుకూరు తరువాత అంతటి ప్రాశస్త్యం కలది. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇక్కడ చిన్న ఆంజనేయస్వామి గుడి ఉండేది. పక్కనే పుష్కరిణి ఉండేది. వెంకన్న