జాతి ఆ’మో’దించిన నేత
ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి, అంతటా తానై నిలవాలనే సంకల్పం, దీక్ష, పట్టుదల ఒక మనిషిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. అలాంటి నిరంతర దీక్షాశీలి, నిరంతర అన్వేషి, ఎవరికీ తలొగ్గని నిజమైన రాజకీయవేత్త, తాననుకున్నది సాధించి తీరాలన్న పట్టుదల... ఇవన్నీ కలగలిస్తే.. నరేంద్ర దామోదరదాసు మోదీ!. ఒక అడుగుకు ఇంకో అడుగు తోడయితేనే విజయపథ సోపానాలధిరోహించగలరు. అలా ఒక్కొక్క అడుగును మిళితం చేస్తూ అట్టడుగు ప్రచారక్ స్థాయి నుంచి దేశ



