వ్రతాలకు నెలవు సకల శుభాలకు శ్రవణ స్వాగతం

శావణ మాసపు శుభవేళ ప్రతి ఇల్లు ఒక కోవెలను తలపిస్తుంది. నెల రోజుల ఈ శుభ మాసం సర్వ శుభాలకు ‘నెల’వవుతుంది. ముప్పయికి ముప్పై రోజులూ శ్రావణ మాసంలో పవిత్రమైనవే. పూజలు, నోములు, పండుగలు, పర్వాలు.. అటు ఇళ్లలో ఇటు దేవాలయాల్లో పండుగ సందడి నెలకొంటుంది. ముత్తయిదువులదే ఈ నెలంతా సందడి. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన

నమో నమామి

ఆయన సామాన్యుడు. కానీ, అసామాన్య విజయాన్ని సాధించారు. ఆయనకు కుల బలం లేదు. కుటుంబ బలగం అంతకంటే లేదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఆయనో చౌకీదార్‍ (కాపలాదారు). చాయ్‍వాలా. కానీ, తన మాటల చాతుర్యంతో.. చేతల గట్టితనంతో అఖండ భారతావనిని తన కర‘కమలాల’తో కట్టిపడేశాడు. ఆ ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ (న.మో.). నరేంద్ర దామోదర్‍ దాస్‍ మోదీ. ఆ పేరు భారత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన మ్యాజిక్‍ అంతా

సూర్య నమస్కారాలు

‘టైం ఎంత?’.. చాలా తరచుగా ఏదో సందర్భంలో మనం అడిగే ప్రశ్న ఇది. అవతలి వారు టైం చెప్పగానే కృతజ్ఞతగా ‘థ్యాంక్స్’ అని బదులిస్తాం. ఇది కనీస మర్యాద. మరి, అసలు టైం (సమయం) మొదలయ్యేదే సూర్యుడి నుంచి. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలకు ఆయనే ఆద్యుడు. అటువంటి ఆదిత్యునికి మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి?. అందుకే నిద్రలేచిన వెంటనే ఆయనకు ఒక నమస్కారం చేయడం మన కృతజ్ఞత. అదే

జయ జయ శంకర

ఆయన విద్వద్వరేణ్యుడు, మహాపండితుడు, గొప్ప తత్వవేత్త, సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన మహాయోగి, గొప్ప మత సంస్కర్త, సంఘసంస్కర్త అన్నిటికీ మించి మహాజ్ఞాని.... ఆయనే సాక్షాత్తూ శంకరుని అంశతో జన్మించిన శంకరాచార్యులు. ఆది శంక రులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. పూవు పుట్టగానే పరిమళిస్తుందన డానికి అసలైన ఉదాహరణ ఆయన జీవితం. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో

రామ ధర్మం… మా’నవ’ ధర్మం

ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే, రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మునుముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శ్రీరామునిలా ఉండాలని, తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడేమో! రాముడిని దేవుడిలా కాదు.. మానవుడిలా చూస్తే.. ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో తెలిసి వస్తుంది.

Top