పలుకు తేనెల తల్లి!

సిరి దేవత లక్ష్మీదేవి గురించి తెలుసుకునే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. భారత యుద్ధం ముగిసింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పరుండి అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలా ప్రాణాలను నిలుపుకోవాలనే తలంపుతో ఉన్నాడు. కృష్ణుడు, ధర్మరాజు తదితరులు ఆయన వద్ద విచార వదనాలతో నిల్చున్నారు. అక్కడ రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ‘ధర్మనందనా! భీష్ముడు రాజనీతిజ్ఞుడు. లోకం పోకడ తెలిసిన మనిషి. సకల ధర్మాలూ తెలిసిన

మూర్తి’ చిన్నది కీర్తి గొప్పది

మన ఉపనిషత్తుల్లో అతి చిన్నది- కైవల్యోపనిషత్తు. కానీ, ఇది బోధించే విషయం మాత్రం చాలా పెద్దది. ఇది అథర్వణ వేదంలో ఉంది. స్వయంగా అనేక మంత్రాలను వేదాల్లో చేర్చగలిగిన సామర్థ్యమున్న అశ్వలాయన మహారుషి అడిగిన ప్రశ్నలకు చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన సమాధానాల సారమే ఈ ఉపనిషత్తు. శుద్ధ ఆత్మతత్త్వం ఈ ఉపనిషత్తులోని ముఖ్యాంశం. సాధారణంగా భోజన సమయాల్లోనూ, ఇతరత్రా తీరిక వేళల్లో భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పఠించడం చాలామందికి అలవాటు. అయితే,

అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి

శరీరాన్ని యోగా.. మనసును ధ్యానం నియంత్రించి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకూ లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో నయమవుతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒత్తిడినీ మోస్తున్నారు. ఈ యాంగ్జయిటీ కారణంగా శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగానే.. మనిషి, మనసు అదుపు తప్పుతున్నాయి. అసంతృప్తి, ఆందోళన, డిప్రెషన్‍.. ఇంకా మానసిక రుగ్మతలు మనసు అదుపు తప్పడం వల్లనే కలుగుతున్నాయి.

చింతచెట్టు నేర్పిన పాఠం

పొదుపుగా ఖర్చుపెడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బు దానికదే ఆ తరువాత రెట్టింపు అవుతుంది. అలాకాకుండా, విలాసాలకు పోయి ఉన్న ధనం ఖర్చు చేస్తే బికారులు కావడం తథ్యం. ఈ నీతినే తెలియచెబుతుంది. ప్రాచీన చైనా దేశపు ఈ నీతి కథ. పూర్వం చైనా దక్షిణ సముద్రతీరాన ‘స్వతేవు’ అనే ఓడరేవు దగ్గర గ్యాన్‍హాంగ్‍, హయాంగ్‍ అనే ఇద్దరు చైనా వర్తకులు ఇరుగుపొరుగున ఉండేవారు. ఇద్దరూ చిన్న నాటి నుంచీ ప్రాణ స్నేహితులు.

ధూర్జటి గారి గర్వం

శ్రీకృష్ణదేవరాయల సాహితీ మండపం పేరే భువన విజయం అని చెప్పుకున్నాం కదా! అది పాండిత్యంతో పాటు శృంగార సాహితీ పక్రియలకు కూడా ఎక్కువగా వేదికవుతూ ఉండేది. ముఖ్యంగా శృంగారభరితంగా ఉండే ధూర్జటి వారి కవిత్వాన్ని రాయల వారు ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తే వారు. ఇదంతా మిగతా కవులకు చిన్నతనంగా ఉండేది. అవమానంగా కూడా భావించే వారు. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని మిగతా కవులంతా తెనాలి రామకృష్ణుడిని

Top