శివమే సత్యం…నిత్యం
అణువు నుంచి బ్రహ్మాండం వరకూ, సకల చరాచరులూ ముల్లోకాలూ అన్నీ పరమేశ్వర రూపమైన ఆ మహాలింగ గర్భంలోనే ఇమిడి ఉన్నాయి. అందులో లేకుండా బాహ్యంగా మరేమీ లేదు. అటువంటి సకల బ్రహ్మాండ రూపమైన ‘శివలింగ’ పూజ మహోత్క•ష్టమైనది. ‘శివ’ నామం మహిమాన్వితమైనట్టిది. ‘శి’ అక్షరం పాపాలను పోగొట్టేది. ‘వ’ అక్షరం మోక్షాన్ని ప్రసాదించేది. సకల పాపహరుడు, మోక్షదదాయకుడూ అయిన సకల ‘శివ’ శంకరుడు అయిన పరమేశ్వరుడు పరబ్రహ్మగా మహాలింగ జ్వాలారూపుడై