నవోదయ 2019 నూతన సంవత్సర వేడుకలు

అట్లాంటా హిందూ దేవాలయం

చలినీ, వర్షాన్నీ లెక్కచేయని ఉత్సాహం… ప్రతి ఒక్కరిలోనూ వెల్లివిరిసిన భక్తి పారవశ్యం… జార్జియాలోని రివర్‍డేల్‍ అట్లాంటా హిందూ దేవాలయంలో (హెచ్టీఏ) ఈ ఏడాది జనవరి 1న నవోదయ 2019 పేరిట జరిగిన నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరిగాయి.

తొమ్మిది వేల మందికి పైగా భక్తులు ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆ రోజున శివ, బాలాజీ ఆలయాలలోని దేవతామూర్తులను రంగు రంగుల పూలదండలతో సొగసుగా, శోభాయమానంగా అలంకరించారు. అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసిన అలంకరణ అక్కడికి విచ్చేసిన భక్తులకు ఆనందాన్నిచ్చింది. సుదీర్ఘకాల అనుభవం కలిగిన అర్చకులు శ్రీ గోపాల భట్టార్‍ , శ్రీ శ్రీనివాస శర్మ , శ్రీ పవన్కు మార్‍, శ్రీ శివనాగ కుమార్‍, శ్రీ సునీల్‍ కుమార్‍, శ్రీ రవిశంకర్‍, శ్రీ వేదవ్యాస, శ్రీ మురళీక•ష్ణ, శ్రీ గోవర్థనం, శ్రీ భరత్‍ మరియు శ్రీ సుబ్ర మణ్యం ‘‘కొత్త ఏడాదిలో తమకన్నీ శుభాలే జరగాలని, తమ కోరికలన్నీ నెరవేరా’’లని భగవంతునికి విన్నవించుకోవటం కోసం ఆలయానికి విచ్చే సిన భక్తులందరికీ అర్చనాదులు నిర్వహించి వారికి ఆశీర్వ చనాలు అందచేశారు.

ఆలయ కార్యనిర్వాహక వర్గం వారు ఆలయ వంటశాలలో భోజన ఏర్పాట్లు, షాపింగ్‍, పార్కింగ్‍లకోసం విస్తతమైన ఏర్పాట్లు చేశారు. దేవాలయం కొత్త ప్రెసిడెంటు శ్రీమతి షీలా లింగం 1986 నుంచీ భక్తురాలిగా ఈ ఆలయానికి సేవచేస్తున్నారు. ఆలయ కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన శ్రీమతి షీలా1996లో హెచ్టీఏ ట్రస్టీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి షీలా మాట్లాడుతూ ‘కొత్త సంవత్సరం తొలి రోజున భగవంతుడి ఆశీర్వా దాలకోసం ఇక్కడికి వచ్చిన భక్తులను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆలయ అటార్నీ శ్రీమతి సౌమ్యా శిఖల్‍ నిర్వహించిన ప్రతిజ్ఞా కార్య క్రమంలో ఎగ్జిక్యూటివ్‍ కమిటీతో పాటు నేనూ పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ సంద ర్భంగా దాతలు, ట్రస్టీలు ,పూర్వ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్‍ కమిటీ మెంబర్లు, భక్తులు, ఆలయ సందర్శకులకు క•తజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ఉత్సా హంతో, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి ఈ ‘నవోదయ’ స్రంబరాలను ఉల్లాసంగా జరిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు కూడా క•తజ్ఞతలు. అలాగే 31 డిసెంబరు మొదలుకొని జనవరి 1న ఈ కార్యక్రమం జరిగేంతవరకూ గంటల కొద్దీ అవిరామంగా పని చేసి, దేవతా మూర్తులను అత్యంత సుందరంగా, సుశోభితంగా అలంకరించి పూజాకార్యక్రమాలు, అర్చనాదులు నిర్వహించిన అర్చకులకు వంద నాలు. అలాగే హెచ్టీఏ తరపున వందల మంది భక్తులకు షడ్రసోపేత మైన భోజనాన్ని వడ్డించి వారిని సంతుష్టులను గావించిన శ్రీ శ్రీనివాసన్‍, శ్రీ రామక•ష్ణగార్లకు వారి వలంటీర్ల బ•ందానికి క•తజ్ఞతలు. పిల్లలు రుచికరమైన భోజనంతో పాటు ఫేస్‍ పెయింటింగ్‍, మెహందీ, కాటన్‍ క్యాండీ, బెలూన్‍ ట్విస్టింగ్‍ వంటి వినోద కార్య క్రమాలను ఎంతగానో ఆస్వాదించినందుకు సంతోషం. చక్కని ఏర్పాట్లు చేసిన రవిచందర్‍ నేత•త్వంలోని వలంటీర్ల బ•ందానికి క•తజ్ఞతలు. భద్రత మరింత పటిష్టంగా ఉండేలా ఆలయ సముదాయంలోని భవనాలకు పెరిమీటర్‍ వాల్‍ నిర్మించడం, మరింత మెరుగైన సదుపాయాలను కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడం, ఆలయ వంటశాల, భోజన శాలలను మరింత ఆధునికీకరించడంపై ఎగ్జి క్యూటివ్‍ కమిటీ మరియు ఆలయ సిబ్బంది ప్రధానంగా ద•ష్టి సారిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈనాడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాత్రమే కాక ఈ ఏడాది పొడవునా ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనాల్సిందిగా కార్యవర్గం మిమ్మలందర్నీ ఆహ్వానిస్తోంది. ఇక చివరిగా ‘‘ఎంతో ఉత్సా హంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తు లందరికీ నా క •తజ్ఞతలు. మీ అందరూ ఈ నూతన సంవ త్సరంలో ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యా త్మికంగా మరింత వ•ద్ధి చెందాలని ఆకాంక్షిస్తు న్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు.’’

కార్యనిర్వాహక కమిటీ సభ్యులు

ఉపాధ్యక్షులు: ‘సుబ్బయ్య ఈమని కార్యదర్శిగా అర వింద్‍ గోలి, జాయింట్‍ సెక్ర టరీగా రవి కరి, ట్రెజరర్‍ సాయి సూరపనేని, ప్రసాద్‍ తుమ్మల బాధ్యతలు స్వీక రించారు. పూర్వ అధ్యక్షులుగా శ్రీమతి కుసుమకొట్టె పనిచేశారు.

కమిటీ సభ్యులు:

ఆలయ నిబంధనలు: సుజాతారెడ్డి
కమ్యూనిటీ సేవలు: కిరణ్‍ శైలేంద్ర
నిర్మాణం: జగన్రావు
సాంస్క•తిక వ్యవహారాలు: జ్యోతి చింతలపూడి
విద్యా వ్యవహారాలు: పీ.కే రాజు వానపల్లి
ఎండోమెంట్‍ ట్రస్ట్: శివ నాథన్‍
ఫుడ్‍ కమిటీ: తులసి వాన పల్లి
ఫండ్‍ రైజింగ్‍ : హైమావతి మిక్కిలినేని
ఇంటర్నల్‍ ఆడిట్‍: కుసుమ ద్రోనవల్లి
మెయింటెనెన్స్: రామ
క•ష్ణన్‍ శ్రీనివాసన్‍
నామినేషన్‍: భరద్వాజ్‍ అమి ర్నేని
ప్రచురణలు: విజు చిలువేరు
రెలీజియస్‍ కమిటీ: పద్మ కోగంటి
టెక్నాలజీ: రజితా రెడ్డి
వలంటీర్‍ కమిటీ: వలంటీర్‍ ఛైర్‍: రవి చందర్‍
యువజన వ్యవహారాలు: శ్రీ వర్షిణి

-రాజేశ్వరి అన్నవరపు
ఫొటోలు: మహదేవ్‍ దేశాయ్‍

Review నవోదయ 2019 నూతన సంవత్సర వేడుకలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top