అంతర్యామి
యోగవిద్యను అవతార పురుషుడైన శ్రీమన్నారాయణుడు పారంపర్యంగా వివస్వంతుడికి, విశ్వదీప్తుడైన ఆ వివస్వంతుడు (సూర్యుడు) మను ప్రజాపతికి, ఆ మహర్షి ఇక్ష్వాకు మహారాజుకు బోధించారు. అలా బ్రహ్మర్షి నుండి రాజర్షి వరకు యోగవిద్య పరంపరగా లభించింది. ఈ విషయాన్ని మహావిష్ణువే కృష్ణావతారంలో అర్జునుడికి కురుక్షేత్రం వద్ద వెల్లడించాడంటోంది గీతామాత. పరమాత్మ/ పరబ్రహ్మ అలా అవతారాలు ధరించడానికి కారణం ఏమిటన్నదే అనేకమంది జిజ్ఞాసువుల హృదయాల్లో ఉదయించే ప్రశ్న కృష్ణపరమాత్మ బోధను మననం చేసు కోవడం