రాముడు చెక్కిన ఆంజనేయుడు
శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీ తీరాన ఉందీ వాయు క్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ।। అంటే.. శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో