అమ్మ ప్రేమకు మారు పేరు
లోకంలో ఎందరు బిడ్డలైనా ఉండవచ్చు. వాళ్ల తత్వం వేరు. అయితే, ఎందరు తల్లులైనా ఉండవచ్చు. ఆ తల్లుల తత్వం మాత్రం ఒక్కటే. అవును! ఈ సృష్టిలో ప్రతి తల్లి తత్వం ఒక్కటే. అది- ప్రేమ, మమకారం, సేవ, అంకితభావం, త్యాగాల మేళవింపు. ఆ బేల మనసులో, ఆ బలహీన శరీరంలో బిడ్డ పట్ల కొండంత ప్రేమ. బిడ్డ కోసం కొండను ఢీకొట్టేంత తెగువ.. సర్వం ఇవ్వగల,