ఆది దైవం జగన్మాత
ఆది దైవం జగన్మాత అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ. శరత్కాలం నిర్మలత్వానికీ, శరశ్చంద్రుడు ప్రశాంతతకు ప్రతీకలు. అలాగే నిర్మలమైన ప్రేమ, కరుణను కురిపించే చల్లని మనసు మాతృమూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి, నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. ‘నవ’ సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. తొమ్మిది సంఖ్యకు ప్రతిరూపమైన