గురువే సర్వస్వం
గురుసేవ ఎలా చేయాలి? సేవ అనేది చాలా పవిత్రమైనది. ఇష్టముంటే చేయడం లేదా మానటం సేవ అనిపించుకోదు. ‘ఈ శరీరం గురువుది. నా తనువు, మనసు, బుద్ధి గురువు ఆధీనంలోనే ఉన్నాయి. నేను స్వతంత్రుడను కాను’ అనే భావంతో గురుసేవ చేసే వారు ధన్యులు. గురుశిష్య సంబంధాలకు అద్దంపట్టే ఉదాహరణలు మన పురాణేతిహాసాల నిండా అనేకం ఉన్నాయి. హితాహితాలు ఎరిగిన వాడు గురువు. గురువు ఏది చెప్పాడో అదే హితాన్ని కలిగిస్తుంది. గురువు పట్ల

