అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ..
మనం ఏ కార్యం నిర్వహించాలన్నా మూడు శక్తులు అవసరం. అవి- పని చేయడానికి సంకల్పం- ఇచ్ఛాశక్తి, సంకల్పం కార్యరూపం దాల్చడానికి- క్రియాశక్తి, కార్యనిర్వహణా విధానానికి- జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. అమ్మకు చెందిన ఈ మూడు శక్తులూ మన ద్వారా వ్యక్తమైనప్పుడే మనం ఏ కార్యాన్ని అయినా సాధించగలం. కానీ, అమ్మ అనంత శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోలేక, అజ్ఞానానికి లోనై మన శక్తియుక్తుల వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయని భ్రమిస్తున్నాం.