ఆనందో బ్రహ్మ
చిత్రకారుడు రోదిస్తూ బొమ్మలు గీయడు. శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని చెక్కడు. నృత్యకారుడు విలపిస్తూ నాట్యం చేయడు. గాయకుడు బాధపడుతూ గీతాన్ని ఆలపించడు. సంగీతకారుడు కుమిలిపోతూ సంగీతాన్ని వినిపించడు. కవి బరువెక్కిన గుండెలతో కాదు.. తేలికైన హృదయంతోనే తన రచనలకు రూపునిస్తాడు. ఇంకా ఎందరో.. తమ కళలు, వృత్తి పనుల్లో నిమగ్నమైన వారు ఆనందంతోనే ఆయా పనులను ఆవిష్కరిస్తారు. ఎందుకంటే ఏదైనా పనిలో ఉన్నవారు ఆ పనిలో నిమగ్నమవుతారు. అది బ్రహ్మానంద క్షేత్రం. అందులో ఉండేది కేవలం ఆనందమే. ఆ ఆనందంలో

