తెలుగుపత్రిక.. ఇకపై సరికొత్తగా..
విలక్షణ శీర్షికలతో తెలుగు వారి లోగిళ్లలో వెలుగులు నింపుతున్న తెలుగుపత్రిక ఆరంభమైన అచిరకాలంలోనే అందరి ఆదరాభిమానాలను చూరగొంది. పది నెలల పాటు విదేశీ గడ్డపై తెలుగు సౌరభాలను విరజిమ్మింది. అయితే, పత్రికను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలుగుపత్రిక బృందం ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. ‘పత్రిక ఎలా ఉంది?’, ‘ఇంకా ఎటువంటి శీర్షికలు కావాలని కోరుకుంటున్నారు?’, ‘పాఠకుల ఆసక్తులు, అభిరుచులు ఏమిటి?’ తదితర అంశాలపై పాఠకుల నాడిని కనుగొనే



