కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా ఏం చేయాలా? అని ఆలోచించే సందర్భం..
కొత్త ఏడాది ముంగిట్లోకి కొంగొత్త ఆశలతో అడుగుపెడదాం.
పోయినేడాది కాలమంతా ఎలా గడిపామో.. ఏ క్షణాన్ని ఎలా ఖర్చు పెట్టామో తెలియదు.
లెక్క చూసుకుంటే.. వృథాగా కొన్ని.. సద్వినియోగం చేసుకున్న రోజులు మరికొన్ని..
గతం గత:
కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి.. కొన్ని నడకలు అలసిపోతాయి.. కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకుంటాయి.. ఇవన్నీ అందరి జీవితంలో ఉండేవే..
మంచో.. చెడో.., కష్టమో.. సుఖమో.., ఆనందమో.. బాధో.., లాభమో.. నష్టమో.., నడకో.. పరుగో.. ఏదైతేనేం..?!
గమ్యం చేరని లక్ష్యాలపై మళ్లీ గురిపెట్టాలి.
నీరసపడిపోయిన నిర్ణయాలకు కొత్త ఉత్సాహాన్నివ్వాలి.
కలంలో కాలాన్ని నింపి పాత తీర్మానాలను తిరగరాయాలి.
ఒట్టి చేతులనే గట్టి ఆయుధాలుగా మలుచుకోవాలి.
ఒక స్పష్టమైన దార్శనికతతో జీవితాన్ని మొదలుపెట్టడానికి ఈ క్షణాన్ని మించింది లేదు.
శుభ సంకల్పాలకు శ్రీకారం చుట్టాలనీ.. అన్నీ శుభాలే జరగాలని అందరూ కోరుకునే వేళ ఇది..
మనం సాధించబోయే విజయాలకు ఈ ఉగాది ఒక వేదిక కావాలి.
మరిచిపోలేని వేడుక కావాలి.
నాయకత్వ లక్షణాలు, చక్కని భావ వ్యక్తీకరణ, మితభాషిత్వం, మృదుభాషిత్వం, మధుర భాషిత్వం, సత్యభాషిత్వం, సేవా భావం, శాంత స్వభావం, విధాన నిర్ణయ చాకచక్యం, అహింస, సత్ప్రవర్తన, నడవడి, సానుకూల దృక్పథం, ధర్మాచరణ, త్యాగం, ప్రేమ, అన్నదమ్ముల అనుబంధం, రాజ్యకాంక్ష లేకుండటం, స్నేహశీలత, భార్యాభర్తల అనుబంధం, మాతాపిత పాదసేవ, శత్రువును కూడా మిత్రుడిగా భావించడం, ఏకపత్నీ వ్రతం, తండ్రి మాట జవదాటకుండటం.. ఇలా ఎన్నో సుగుణాల రాశి శ్రీరాముడు.
ఇన్ని సకల సుగుణాల శోభితుడు కాబట్టే ఆయనను ‘రామా’ అని స్మరిస్తే క్షణంలోనే మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
మంచి లక్షణాలు, మంచి లక్ష్యాలు ప్రసాదించాలని నవమి వేళ ఆ రాముడిని వేడుకుందాం.
(శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు)
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు




































































Review శుభాలకు నాంది.