కాకి లెక్కలు
ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లే సరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లను ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్ధమయ్యింది బీర్బల్‍కు. అతను నెమ్మదిగా చక్రవర్తి వద్దకు వెళ్లి, ‘విషయం ఏమిటి జహాపనా?’ అని అడిగాడు. ‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకు పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’ అన్నాడు అక్బర్ కోపంగా. ‘అసలు సంగతేంటి జహాపనా?’ అన్నాడు




