కోయిల పిలుపు… ప్రకృతి మెరుపు
శ్రీ శార్వరి నామ సంవత్సరం- ఫాల్గుణ-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయనం
పకృతి సమస్త వర్ణాలతో సర్వాంగ సుందరంగా ప్రకాశించే మాసం- చైత్రం. ఇది ఆంగ్ల కాలమానం ప్రకారం మార్చి నెల. మూడవది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది సంవత్సరారంభ మాసం. చైత్ర మాసం తొలి రోజే మనకు ఉగాది లేదా సంవత్సరాది. ఇది వసంత మాసం. అయితే, మార్చిలో ఎక్కువ రోజులు ఫాల్గుణ మాస తిథులే వస్తాయి. చివరి ఏడు రోజులే చైత్ర మాసం తిథులు ఆరంభమై.. ఏప్రిల్ వరకు