ఐస్‍క్రీమ్‍ అంటే ఇష్టం

జో బైడెన్‍కు ఐస్‍క్రీమ్‍ అంటే మహా ఇష్టం. సగం చాక్లెట్‍, సగం వెనీలా కలిపి తినడాన్ని బాగా ఇష్టపడతారని ఆయన మనవరాళ్లు చెబుతారు.

  • 1991లో గల్ఫ్ యుద్ధాన్ని బైడెన్‍ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాక్‍పై యుద్ధానికి మాత్రం మద్దతునిచ్చార్యుబరాక్‍ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒసామా బిన్‍ లాడెన్‍ను చంపాలని నిర్ణయించారు. అది రిస్క్తో కూడుకున్న పని అని ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‍ వారించారట. అయినా ఒబామా తన నిర్ణయానికే కట్టుబడి లాడెన్‍ను పక్కా కార్యాచరణతో తుదముట్టించారు.
  • జో బైడెన్‍కు పాకిస్తాన్‍ ప్రభుత్వం 2008లో తన దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘హిలాల్‍ ఏ పాకిస్తాన్‍’ను బహూకరించింది. 1.5 బిలియన్‍ డాలర్ల (సుమారు పది వేల కోట్ల రూపాయలు) సైనికేతర ఆర్థిక సహాయం తన దేశానికి అందించేలా చేసినందుకు పాకిస్తాన్‍ ఈ పురస్కారాన్ని ఆయనకు అందించిందని అప్పట్లో చెప్పుకునే వారు.
  • తన ఉపన్యాసాల ద్వారా లక్షల డాలర్లు ఆర్జించిన బైడెన్‍.. గతంలో ఓసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడి.. తన ఉపన్యాసాల్లో వేరే వాళ్లను కాపీ కొట్టినట్టు తేలడంతో అధ్యక్ష పదవికి పోటీచేసే అర్హత కోల్పోవడం విశేషం
  • ఆరోగ్యం విషయంలో బైడెన్‍ చాలా జాగ్రత్తగా ఉంటారు. 77 సంవత్సరాల వయసులోనూ పరుగులాంటి వేగంతో నడవగలుగుతున్నారు
  • బైడెన్‍కు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు లేవు.
  • 80 కిలోల బరువుతో, వారానికి ఐదు రోజులు కచ్చితంగా వ్యాయామం చేస్తారు.
  • 1988లో ఒకసారి బైడెన్‍కు తీవ్ర అనారోగ్యం కలిగింది. మెదడుకు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇక ఆయన చనిపోతాడని భావించిన బంధువులు చర్చి పాస్టర్‍ను కూడా పిలిచారు. అయితే, ఈ అనారోగ్యం నుంచి ఆయన తొందరగానే కోలుకున్నారు.
  • బైడెన్‍ రెండో కుమారుడు హంటర్‍ మందు, డ్రగ్స్కు బానిసై.. డోప్‍ టెస్ట్లో పట్టుబడి 2014లో అమెరికా నౌకాదళం రిజర్వ్ నుంచి బయటికి వచ్చాడు. బైడెన్‍ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‍ గ్యాస్‍ కంపెనీ బోర్డ్ ఆఫ్‍ డైరెక్టర్స్లో హంటర్‍ ఒకరిగా ఉన్నాడు. ఈ సందర్భంగా అవినీతి, అధికార దుర్వినియోగం జరిగాయంటూ.. ఇటీవల ఎన్నికల్లో బైడెన్‍పై ట్రంప్‍ ఆరోపణలు గుప్పించారు. హంటర్‍ ప్రస్తుతం లాస్‍ఏంజెల్స్లో పెయిం•ర్‍గా జీవితం గడుపుతున్నారు.
  • మన హిందూ పండుగలు, పర్వాలన్నీ చాంద్రమానం ప్రకారం నిర్ణయమైనవే. ఒక్క సంక్రాంతి మాత్రం ఏటా సౌరమానం ప్రకారం నిర్వహించుకుంటారు.

Review ఐస్‍క్రీమ్‍ అంటే ఇష్టం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top