నీ పాట తీయనిది..
భావానికి తేనెలు.. భాషకు పరిమళాలు అద్ది తెలుగు సినిమా పాటను స్వరరాగ పదయోగ సమభూషితంగా తీర్చిదిద్దిన అక్షర చైతన్యం.. సినారె. ఆయన సినీ గీతాల్లోని పదలాలిత్యం, భావ సౌకుమార్యం.. ఆ పాటల్ని వినినంతనే మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయన జనరంజకమైన సినీ గేయాలు తెలుగు వాకిట పాటల పూదోటలై వికసిస్తూనే ఉంటాయి. ‘గులేబకావళి కథ’ (1962) ద్వారా ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఆయన తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాకు



