వైట్ హౌసు లో ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కూతురు ఇవాంకాకు కీలకపదవి లభించింది. వైట్‍హౌస్‍లో తనకు ప్రత్యేక అసిస్టెంట్‍గా ఇవాంకాను నియమించారు ట్రంప్‍. ఇటీవలే ఇవాంకా భర్త జారెద్‍ కుష్నర్‍.. ట్రంప్‍కు సీనియర్‍ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా కూతురు ఇవాంకా కూడా ఇదే బాధ్యతను చేపట్టనున్నారు. వీరిద్దరు జీతం తీసుకోకుండా పనిచేయనున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్‍ ఎన్నికైన నాటి నుంచి వీరిద్దరువైట్‍హౌస్‍ కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటున్నారు. జనవరిలో జపాన్‍ ప్రధాని షింజో అబేవచ్చినప్పుడు

ఇండో అమెరికన్స్ కు నోబెల్ ప్రైజ్

శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే సొసైటీ ఫర్‍ సైన్స్ అండ్‍ ద పబ్లిక్‍ (ఎస్‍ఎస్‍పి) పురస్కారం-2017కు ఇండో అమెరికన్‍లు ఇంద్రాణి దాస్‍, అర్జున్‍ రమణి ఎంపికయ్యారు. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్‍ మొదటిస్థానంలో నిలిచి రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్‍మనీ గెలుచుకోగా కంప్యూటర్‍ పోగ్రామింగ్‍లో పరిశోధనకుగాను అర్జున్‍ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్‍మనీని గెలుచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను

క్యారీలాం సెన్సేషన్

హాంకాంగ్‍లో మొట్టమొదటి మహిళా నాయకురాలు క్యారీలామ్‍ సెన్సేషన్‍ సృష్టిస్తోంది. చైనాలో అత్యున్నత నాయకులైన మాజీల్లో.. రెండో స్థానంలో ఉన్న ఈమె హాంకాంగ్‍ నూతన నేతగా ఎన్నికయింది. మాజీ ఫైనాన్స్ సెక్రెటరీ అయిన జాన్‍శాంగ్‍ను ఓడించి 777 ఓట్లతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో శాంగ్‍కు 365 ఓట్లు లభించాయి. క్యారీ ఎన్నికకు అనువుగా చైనా కమ్యూనిస్ట్ నాయకత్వం నెరపిన లాబీ ఫలించింది. హాంకాంగ్‍లో బ్రిటీష్‍ ఆధిపత్యం అంతమయ్యాక ఈ సిటీకి

సీమవర్మ కు ఉన్నతపదవి

అమెరికన్ల ఆరోగ్యబీమా పథకాలను పర్యవేక్షించే హెల్త్కేర్‍ ఏజెన్సీ చీఫ్‍గా సీమావర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆరోగ్యపరిరక్షణ రంగంలో అత్యంత నిపుణుల్లో ఒకరైన సీమను ఎంపిక చేసిన ట్రంప్‍ ఈ కీలక బాధ్యతలు అప్పగించారని శ్వేతసౌధంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మైక్‍పెన్స్ వెల్లడించారు. మెడికేర్‍, మెడికెయిడ్‍ ఆరోగ్యకేంద్రాల చీఫ్‍గా ఆమె.. ట్రిలియన్‍ డాలర్ల ఫెడరల్‍ హెల్త్కేర్‍ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు.

వచ్చే ఏడాది లాటరీ పద్ధతి లో వీసాలు

వచ్చే ఏడాది లాటరీ పద్ధతిలో వీసాలు అమెరికా వెళ్లేందుకు హెచ్‍ 1బీ వీసాలు వచ్చే ఏడాది వరకు లాటరీ పద్ధతిలోనే కొనసాగనున్నాయి. ఈ విధానాన్ని సవాల్‍ చేస్తూ దాఖలైన పిటిషన్‍ను ఆ దేశ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఏప్రిల్‍ 3 నుంచి ప్రారంభమయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‍-1బీ వీసాల జారీలో ఎలాంటి మార్పు లేదు. దీంతో లాటరీలో ఎంపికైన వాళ్లకి అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం గుర్తింపును

Top